అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
10 Life Quotes in Telugu – లైఫ్ కోట్స్
ఎలుగుబంటి నల్లగా ఉందని
కాకి వెక్కిరించినదట.
మనిషి కూడా అంతే
తనలో వున్న లోపాలను చూసుకోకుండా
ఎదుటివారిని విమర్శిస్తాడు.
మధ్యతరగతి కుటుంబంలో పుట్టి
అటు ఇటు కాని చదువులు చదివి
కుటుంబ బాధ్యతల కోసం
తన లైఫ్ ని పణంగా పెట్టి,
నచ్చని ఒక ఉద్యోగం చేస్తూ,
జీవితంలో ఏమి
సాధించలేకపోయామని బాధ పడుతూ
ఆ బాధను గుండెల్లో దాచుకొని
పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు.
వాళ్లు అసలైన హీరోలు.
కలుపు మొక్క
పెరిగినంత తొందరగా
తులసి మొక్క పెరుగదు, అలాగే
అవినీతి చేసేవాడు
ఎదిగినంత తొందరగా
నిజాయితీపరుడు ఎదగడు.
ప్రశ్న ఏదైనా సరే,
ప్రేమతో బదులు ఇస్తే,
మనం గడిపే ప్రతిరోజు
అందంగా ఉంటుంది.
కాకి, కోయిల రెండు అరుస్తాయి
కాని కాకిది గోల అంటారు,
కోకిలది పాట అంటారు.
ఆలోచించు ఎందుకో?
బదులు ఇచ్చే విధానం తోనే
సగం ప్రపంచాన్ని గెలిచేయొచ్చు.
తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా
చిన్నగా వుండే తులసి చెట్టునే పూజిస్తాం.
అలాగే చెడ్డవాడు ఎంత ధనవంతుడైనా
గొప్ప మనసుండే వారికే గౌరవం దక్కుతుంది.
“అవసరం”
ఈ పదానికి నిజమైన అర్ధం
అది దెయ్యాన్ని కూడా పూజించేలా
చేస్తుంది దేవుణ్ణి కూడా
ద్వేషించేలా చేస్తుంది.
10 Life Quotes in Telugu – లైఫ్ కోట్స్