ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
సహవాసము / స్థలము / కాలము అన్ని ముఖ్యము ..!
ఒక తండ్రి తాను చనిపోయే ముందు, తన కొడుకుని పిలిచి ఒక గడియారం చూపించి, ఇది 200 సం. పైగా వయస్సు కలిగి, మా తాత ముత్తాతల కాలం నుండి నాకు సంక్రమించింది. అయితే ఇప్పుడు నేను దీనిని నీకు ఇచ్చేముందు ఒకసారి నువ్వు బజారులోని గడియారాల షాప్ కి వెళ్లి దీనికి వెల కట్టించుకొని రా అని పంపించాడు.
కొంచెం సేపటికి కొడుకు తిరిగి వచ్చి, ఈ గడియారం బాగా పాతది ఐనది కావున 50 రూపాయలకు మించి రావన్నారు అని చెప్పాడు.
అయితే తండ్రి ఈ సారి కొడుకుని అదే గడియారాన్ని ఒక పురాతన వస్తువుల ( యాంటిక్ ) దుకాణానికి పంపి మరలా వెల కట్టించమన్నాడు. ఈ సారి తిరిగి వచ్చిన కొడుకు ఇక్కడ ఆ గడియారానికి 50000 రూపాయల వెల కట్టినట్లు చెప్పగా..
ఆ తండ్రి అంతటితో ఆగకుండా మరలా కొడుకుని మ్యూజియంకు అదే గడియారం తీసుకొని వెళ్లి వెల కట్టించమన్నాడు..తిరిగివస్తున్న కొడుకు మొహం వెలిగిపోతుండగా, మ్యూజియంలో ఈ పాత గడియారంను పరిశీలించటానికి ఒక నిపుణుడు వచ్చి పరిశీలించి, ఈ పాత గడియారంకు 10 కోట్ల రూపాయలు వెలకట్టినట్లు చెప్పాడు!!
కాగా అది విన్న తండ్రి.. కొడుకుతో దీని ద్వారా నీకు చెప్పాలని అనుకుంటున్నది ఏమిటంటే నీ విలువ కూడా నువ్వు ఉన్న ప్రదేశం మరియు నీ ఆలోచన , నీవు కలిసే మనుషుల బట్టి, నీ విలువ కూడా మారుతూ ఉంటుంది..
అందుకే నీవు ఎప్పుడూ తప్పు ప్రదేశంలో ఉండవద్దు , తప్పు ఆలోచనలు చేయొద్దు మరియు చెడ్డ వ్యక్తులతో కలవద్దు . నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని, నీకు కనీస విలువ లేని ప్రదేశంలో, వ్యక్తులతో అస్సలు ఉండవద్దు, ఆలోచనలు చేయొద్దు ..అంటూ చెప్పాడు……!
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com