Menu Close

పెళ్ళి పెత్తనం – గజేంద్రనాధ్ – Best Stories in Telugu – Telugu Stories

మామా…ఓ..మామా..ఇంటి మెట్లెక్కకుండా పిలుచ్చాండు రగు..లోపల్నించి రగును చూసి నారాయణరెడ్డి …రావోయ్..లోపలికి… ఏమాడ్నించే కేకలేచ్చాండావే..లోపలికి రా..ఏం కుక్కనేమన్యా పాదెంగి వచ్చినావా..అనె .ఉండావో..లేదో..కనుక్కోని..పోయి మా నాయన్ను..అమ్మను తోడుకోనొజ్జామని లే మామా…రగు బయ్యంగానే జవాబు సెప్పిండు ..

ఏందిర నాయాలా..ఏందో..పంచాయతే పెట్టినట్టుండావే…ఏమిరా సోమీ..రోంత నా సెవిలో బై…ఏం లేదులే మామా..అదే…అదే..అంటా..నసిగిండు…ఏందో సెప్పురసోమీ…మల్లా నేను వనిపెంట దాంక పొయిరావాల..ఏందో..మీ యత్త..కంచు..గంగాళం గావాలంటాంది….ఏమిల్యా..మామ..ఆరోజు..మీ తమ్ముడేం నీ ముందరేం సెప్పిండు…ద్యాని గురించి రా తాయ్…

ఏందో..ముజిగుమ్మలు పడ్తాండవే…అదే..మామా..ఆయమ్మిని నాకిచ్చే ఇసయం….వో…అదా…కుమారిని ఇచ్చే ఇసయమా….మాట్లాడ్దాము లేబీ..ఏం కొంపలు మునిగి పోతాండాయనీ…రేపో..మొన్నాడో..మాటాడ్దములే…అన్యాడు నారాయణరెడ్డి..

లేదు మామో..అంత టైము లేదు….ఏందో ఆయమ్మిని జూడ్డానికి కొరపాట్నించి ఎవురో..సాప్టేరు వచ్చిండంట..మాయత్త రోంత మొగ్గు ఆపక్కనే జూపుతాందంట..ఆ పొద్దు పిల్లనీమంటే..ఉజ్జోగం లేదనె..ఎట్టనో కట్ట సచ్చిదోరుగాలమై సచివాలయంలో పోస్టు దెచ్చుకున్యాంక ఇపుడెవరికో..ఇచ్చానంటే..ఎట్ట..అన్నీ..ఆయమ్మ మాటలేనా…

ఇపుడేమంట రా ఆయమ్మికి… ఏముందీ..సాప్టేరైతే…బెంగ్లూరో…ఐద్రాబాదో..ఉండొచ్చంట..ఇదేం ఉజ్జోగం..ఫించనూ…బియ్యం..పంచుకునేది అంటాంది మామా…ఏదైతేం రా ఆయమ్మికి… వాల్ల పిల్లను ఎండమొకం ఎరక్కండా సాకడమే గద గావాల్సిందంటా…

మీ నాయినెమంటాండు…ఆయనేమంటాండు..యాడ వారుపోసి.. బంగపోవాల్రా..వాల్లను..ఒకటేమైన బంగపోతే..సౌక సగం దరిద్రం..అని అగ్గవై పోతామబ్బీ..ఆపొద్దు..పంచాయతీ చేసిన నారాయణరెడ్డి మామ కాడికి పోయిరాపో..అని పంపిండు..నీ కాడికి…

ఐనా..ఇంగ రెండు మూన్నెల్లు..మూడమన్యాడే సామి..ఇపుడెందుకురా మాట్లాడ్డం రగూ…ఇంగో వారం…మూర్తాలుండై మామా…కనీసం..సిన్నొక్కాకన్న పెట్టేతట్టు మాటాడు మామా….అనె రగు..నారాయన్రెడ్డితో…

నారాయన్రెడ్డి ..ఇంట్లోకి బొయి వాల్లామెతో…ఏందిమే ఆయమ్మి..పిల్లను ఈ రగ్గానికి ఇచ్చే..సరిపోద్ది గదా…ముందు ఉజ్జోగం లేదనె..ఉజ్జోగమొచ్చినాంక ఇపుడు మల్ల లిగాడి బెడతాందే…అనడిగిండు..ఆయమ్మిదంతా ఇకారపు ఎవ్వారం లే బ్బా…ఏమన్యా అంటే..మా పిల్లను బాగసాక్కుని..ఈ మొరటుగుంపు క్యాడిచ్చేది అంటాది…

అంటే..మన పిల్లోల్లని పాదెంగిన్యామా..
సరే..అట్ట పోయొచ్చ..వాల్లింటిదాంక…ఈ రగ్గాడు పానం దీచ్చాండడు..అని నారాయన్రెడ్డి కుమారోల్ల ఇంటికాడికి పొయి…మే…రాజమ్మా..అని కేకేసిండు…ఎవురూ..అంట..ఇంట్లోనుంచి బైటికొచ్చింది రాజమ్మ…నారాయన్రెడ్డిని చూసి..రాన్న..కూసుందురా…అని పిల్సింది..మామ యాడికి బొయిండుమీ

అదో..రామిశెట్టంగడీ దాంక పోయిండునా..వచ్చాంటడులే…దా..కాపి తాగుదు…ఇపుడేంటికి లేమ్మీ..కాపీ..రోంచేపైంది..బూదిని.
అంగడి కాడ్నించి వచ్చిన రాంరెడ్డి..ఏమోయ్..నారాయన్రెడ్డి. ..ఏందో దారితప్పొచ్చినావే..ఏంజేజ్జం సోమీ..రెడ్డిగారి కాడికి రాక మాకు తప్పుద్ద్యా..అంటానే..శెతురు సాలీవోయ్..ఏంది కత…అంటా అని అడిగె…అదే వోయ్..మన కుమారిని..రగ్గానికి.. ఇచ్చే ఇసయం..ఏమనుకుంటాండ్రోయ్పి

ల్లోడు గురుత్తమైనోడు..వాలంట్రి గూడ అయిండు..మట్టమైనోడు..వానికీ మన పిల్లను జేసుకోవాలని బంగపడతాండు..అని సెప్తాంటే..
ఆ…ఏముద్ద్యోగం లేన్నొ…ఇంటింటికాడికి తిరిగి.. లెక్కలు..బియ్యం..పంచే ఉద్దోగం..దానికే వాల్నాయిన..మా వానికి పదైదు లచ్చలు..ఇరవై లచ్చలు లిచ్చామంటాండ్రు అని ఆడాడ వాంచుతాండంట..డప్పు..మాకాడ అంత్యాడ ఉందినా…ఇంగో పిల్లుండె..పిలకాయ ఉండాడు…మొన్నొచ్చిన కొమ్మరోలోల్లు..ఉత్తపిల్లనిచ్చే సాలు..అంటే..మేమే పత్తులాలు బంగారు పెట్తామన్యాం…అనింది..

పిల్ల పోటాకు బాగుంది కాబట్టి అట్టనే అనింటారు లేమ్మీ…ఆయప్ప తవర కూతలకేంలే…ఏదో..కొత్తతావున ఇచ్చేబదులు పాత సుట్టాలు కాబట్టీ్..కట్టరాయి.కట్టకు బేజ్జామని నా తాపాత్రంమీ…నేను మాటాడతలే..సెవల్లోకి..ముక్కులోకి..పెట్తే సాలు..పెళ్ళి నేనే కర్సుపెట్టుకోని సేసుకుంటా అంటాండు వాడు..సూడండి..యోశన జేయండి.. రేపు మాయిటాలకల్ల ఏదో ఒకటి సెప్పండిమీ..అని నారాయన్రెడ్డి అంటానే..మరీ అంత అద్దుమానం గా ఏంటికిచ్చంనా…అట్నే..మాటాడుకోని సెప్తం లేన్నా..అనె రాజమ్మ…

నారాయన్రెడ్డి ఆమాట సెప్పిపొయినాంక..రాజమ్మ..ఆయమ్మ పెనిమిటి శాంచేపు పొద్దుపొయిందాక మాటాడుకోని..తట్టుకో..ఒక పారి కుమారిని గూడ కనుక్కుందాం అని..మే..పెద్దాయమ్మీ…నీకు పెత్తనం తీసకచ్చిండు..మీ నారాయణమామ..అదో..తూరుపీది మూలోలాయప్ప కొడుకు రగు…వాలంట్రీ గ పనిజేచ్చాండాడు..తెల్సుగద..అని అడుగుతానే కుమారి తలకాయ ఊపీంది…

మొన్నొచ్చిన కొమురోలు పిల్లోడు బాగుండాడా..ఈడు బాగుండాడా…వాడైతే బెంగుళూరుకు పోవాల..ఈడైతే మనూర్లోనే ఉంటవ్…నీకిట్టం ల్యాకుండ ఏదీ జేయం..అన్నెరిద్దరూ…కుమారి..తలకాయొంచుకోని…మనూర్లోనే ఉంటా..అని పరిగెత్తింది..వసార్లోకి….

కుమారి..మాటలిన్యాంక.రాజమ్మ..ఆయమ్మ పెనిమిటి.. నారాయన్రెడ్డికాడికి పోయి…రగుకే ఇచ్చామనుకుంటాండం లేన్నా…మంచి మూర్తాలు లేవంట గదా..రేపు శనోరం బాగుందంట..సిన్నొక్కాకు పెట్టుకుందం.అంటానే..నారాయన్రెడ్డి అట్నే లేమీ…అట్టైతే రేపు మాయిట్జాము మిగతా ఇసయాలు మాటాడదాములే..అంటా..బైటికి పొయిండు..

రగు సచివాలయం కాడ ఉండి నడిసొచ్చే నారాయన్రెడ్డిని చూసి..ఏం మామా..ఏమైంది నా పెల్లి పెత్తనం..అంటా..అడిగిండు…నీ పని సరిపోయిందిపోవోయ్…అనె నారాయన్రెడ్డి..రగుకు ఎగిరి గంతేసినట్టైంది..థాంక్స్.. మామా..నన్ను ఒకింటోన్ని.చేసినందుకు..అని పొంగి పోతాండాడు….నారాయన్రెడ్డి రగుని చూచ్చ..నాదేముందిబీ.,.వాల్లని ఒకమాట అడగమంటివి..అడిగిన..వాళ్ళకూ నీమీద ఇట్టముంది కాబట్టే ఈ పెళ్ళి పెత్తనం కుదిరింది… ఏమైనా నాకు గొప్ప సాయం జేసినవు మామా…ఇపుడే వచ్చా..అంటా..వాళ్ళింటికి పోయిండు..సామి నడిగి శిన్నొక్కాకు శనారం పెట్టుకున్యరు…పెళ్ళి…ఎండాకాలమైతే బావుంటదిలే అనుకున్నెరు.
(…. ఐపోయిందిబో)

Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు

Subscribe to Our YouTube Channel

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading