ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నాది అనుకుంటేనే దుఃఖం – Moral Stories in Telugu
ఒక ఇల్లు తగలబడి పోతోంది. జనం చుట్టూ చేరి చూస్తున్నారు. యజమాని దూరంగా నిల్చుని రోదిస్తున్నాడు. ఎంతో అందమైన ఇల్లు. పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు. అందుకే దుఃఖం. ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు.
“నాన్నా ఎందుకు ఏడుస్తున్నావ్.. నీకు తెలీదా నాన్నా? మూడు రెట్ల ధర వస్తే, ఇల్లు నిన్నే అమ్మేసాను. నీకు చెప్పేటంత సమయం లేక పోయింది” అన్నాడు. చేత్తో తీసేసినట్టు ఒక్క సారిగా వేదన పోయింది. గుండెల్నిండా సంతోషంగా గాలి పీల్చుకున్నాడు. ఆ తరువాత తనూ ఒకడిగా మంటల్ని చూస్తూ పక్క వారి సంభాషణలో పాలు పంచుకొనసాగాడు…!
అదే ఇల్లు. అవే మంటలు. క్షణం క్రితం వరకూ ఉన్న అటాచ్‌మెంట్ పోయింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే, కాస్త ఆనందిస్తున్నాడు కూడా.
ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. “నువ్వు సంతకం పెట్టకుండా అమ్మకం ఎలా పూర్తి అవుతుంది నాన్నా. ఆమాత్రం తెలీదా?” అన్నాడు. అంతే. తిరిగి దుఃఖం చుట్టు ముట్టింది. కళ్లల్లో నీళ్లు ఎగజిమ్మాయి. అక్కడే కుప్పకూలిపోయాడు.
Very Emotional Story in Telugu – నాన్న చివరి కోరిక తీర్చగలిగానా..?
ఈ లోపులో మూడో కొడుకు వచ్చి, “నాన్నా.. ఇల్లు కొన్న వ్యక్తి మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి. మాటతోనే అమ్మకం జరిగిపోయిందన్నాడు. సగం డబ్బు చెల్లించేశాడు కూడా” అన్నాడు. తిరిగి సంతోషం పెనవేసుకుంది.
‘ఇది నాది’ అనుకున్నప్పుడు దుఃఖం వస్తోంది. కాదనుకున్నప్పుడు పోతోంది. నిజానికి ఏమీ మారలేదు. ఇదే బుద్ధుడు చెప్పిన నిర్వికార నిర్వాణ యోగం. అప్పుడు దుఃఖం మిమ్మల్ని వదిలేస్తున్నందుకు దుఃఖిస్తుంది..
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com