Menu Close

Health Benefits of Marri Chettu – Indiana Banyan Tree – మర్రిచెట్టు

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Health Benefits of Marri Chettu – Indiana Banyan Tree – మర్రిచెట్టు

మర్రిచెట్టును సంస్కృతంలో వట, న్యగ్రోధః అని ఆంగ్లము నందు Banian Tree అని పిలుస్తారు. మర్రిచెట్టు సుప్రసిద్ధం అగు మహావృక్షం. వృక్షములలో ఇంతటి పెద్ద వృక్షం మరొకటి లేదు. పెరిగేకొద్ది కొన్ని ఎకరాల స్థలమును ఇది ఆక్రమించును. చెట్టంతయు జిగురు కలిగిన చిక్కటి పాలను కలిగి ఉండును. ఆకులు సమరేఖలు కలిగి కొన్ని గుండ్రముగా, కొన్ని కోలగా ఉండును. తొడిమ నార కలిగి పొడవుగా ఉండును. లేత ఆకు మృదువుగా, ముదిరినది పండినది పెళుసుగా ఉండును. ఇవి భూమిలో చొచ్చుకొని వేళ్లు పారి మానగును. పండ్లు పగడముల వలే ఎర్రగా ఉండును. పండులో సూక్ష్మ రూపంలో అసంఖ్యాక బీజములు ఉండును.

Health Benefits of Marri Chettu - Indiana Banyan Tree - మర్రిచెట్టు
  • ముందుగా రక్తం పడి ఆ తరువాత మలము పడు
    రక్తపిత్త రోగులకు కోలగా ఉండు చిగుళ్లు చిదగొట్టి పాలలో
    వేసి కాచి ఆ పాలను లోపలికి ఇచ్చిన ముత్ర, మల
    ద్వారముల నుంచి రక్తం కారటం తగ్గును.
  • మర్రి చిగుళ్ళను మరియు గరిక చిగుళ్లను నూరి తేనెతో
    చేర్చి సేవించిన శరీరం నుంచి రక్తం బయటకి వెళ్లే రక్తపిత్త
    రోగం తగ్గును.
  • మర్రి చిగుళ్లను, బూరుగు పైన బెరడు, ముత్తవ
    పులగం వేరు కలిపి మెత్తగా నూరి పైన లేపనం చేసిన
    వ్రణములు మానును.
  • ముఖంపైన మొటిమల సమస్యతో ఇబ్బంది పడువారు
    మర్రిచిగుళ్ళు, చిన్న సెనగలు మెత్తగా నూరి పైకి లేపనం
    చేయుచున్న మంచి ఫలితం ఉండును. మర్రిచిగుళ్ల
    బదులు పండిన మర్రి ఆకు కూడా వాడవచ్చు .
  • అతిసార వ్యాధితో బాధపడువారు మర్రిచిగుళ్లు
    బియ్యం కడుగుతో నూరి మజ్జిగతో తీసుకొనుచున్న
    అతిసార వ్యాధి తగ్గును.
  • నోటిపూతతో ఇబ్బంది పడువారు లేత మర్రి ఊడలు
    చిదగగొట్టి నీటిలో వేసి కషాయం చేసి పుక్కిలించుచున్న
    నోటిపూతలు తగ్గును.
  • దంతములు వదులుగా అయినచో మర్రి ఊడలతో
    పళ్లు తొముచున్న పళ్లు కదులుట, తీపులు తగ్గును.
  • గజ్జి సమస్యతో ఇబ్బంది పడువారు మర్రిచిగుళ్లు,
    పసుపు కలిపి మెత్తగా నూరి పైన రాయుచున్న గజ్జి
    తగ్గును.
  • క్తముతో కూడిన వాంతులు అగుచున్న మర్రిపండ్లు
    పాలలో వేసి కాచి ఆ పాలను తాగిన రక్తవాంతులు
    తగ్గును. స్త్రీలలో కనిపించే ఎర్ర కుసుమ వ్యాధి తగ్గును.
  • శుక్ల నష్టం ఆయ్యేఎప్పుడు మర్రిపండ్లను ఎండబెట్టి
    మెత్తగా చూర్ణం చేసి ఆ చూర్ణమును ఆవుపాలతో కలిపి
    నిత్యం సేవించుచున్న శుక్లనష్టములు తగ్గును.
  • కాలిపగుళ్లతో ఇబ్బంది పడువారు మర్రిపాలను
    కాలిపగుళ్లలో ప్రతినిత్యం నింపుచున్న కాలిపగుళ్ళు
    త్వరగా మానును .
  • ఆహారములో విషదోషాలు హరించు శక్తి మర్రిఆకులతో
    చేసిన విస్తరికి కలదు.
  • నడుమునొప్పితో ఇబ్బంది పడువారు పలచని
    నూలుబట్టను మర్రిపాలతో తడిపి వెంటనే రోగి నడుముకి
    అంటించాలి . అది బాగా అతుక్కిపోతుంది ఈ విధంగా
    రెండుమూడు పట్టీలు వేస్తే ఎంత బాధాకరం అయిన
    నడుమునొప్పి అయినా తగ్గును.
  • అతిమూత్రంతో ఇబ్బంది పడువారు బెత్తెడు ముక్క
    నలగ్గొట్టి పెద్ద గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి
    ఉదయం సగం గ్లాసు వచ్చేంతవరకు మరిగించి వడకట్టి
    చల్లార్చి తాగుతుంటే అతిమూత్రవ్యాది తగ్గును.
  • పిప్పిపన్ను సమస్యతో ఇబ్బంది పడువారు
    మర్రిపాలను దూదితో
    తడిపి పుప్పిపన్ను రంధ్రములో
    ఉంచితే వెంటనే పురుగు చచ్చి కిందకు పడును .
  • చెవిలో పురుగులు దూరి ఇబ్బంది పడుతున్న
    ముందుగా మేకపాలు 5 చుక్కలు చెవిలో వేసి మర్రిపాలు
    నాలుగు చుక్కలు వేస్తే చెవిలో దూరిన పురుగులు
    నశించిపోవును.
  • మాటలు రాని చిన్నపిల్లలకు లేత మర్రి ఊడలు
    మెత్తగా నూరి ఆ గంధాన్ని నాలిక పైన రాయుచున్న
    చిన్నపిల్లలకు మాటలు వచ్చును.
  • మధుమేహముతో ఇబ్బంది పడువారు మర్రిచెట్టు
    బెరడు చూర్ణం ఒక టీస్పూను ఒక గ్లాసు నీటిలో వేసి
    మరిగించి తాగుచున్న మధుమేహం అదుపులోకి
    వచ్చును.

Health Benefits of Marri Chettu – Indiana Banyan Tree – మర్రిచెట్టు

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

Subscribe for latest updates

Loading