ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అయ్యయ్యయ్యో ఆనందమే… ఏదో ఏదో ఆరంభమే
వన్నె వాన విల్లులే… నన్ను కోరి చేరెనే
వలపు పూల జల్లులో… తనువు తడిసి పోయెనే
ఏదో ఒక ఆశ… నీవే నా శ్వాస
అయ్యయ్యయ్యో… అయ్యయ్యయ్యయ్యో… ఓఓ ఓ
అయ్యయ్యయ్యో…
నిన్ను మొదటిగ కన్న క్షణమున… ఎద నీట మునిగే
నాడు మునిగిన మనసునే… ఒక ప్రేమలోన కరిగే
ధరి చేరి నన్ను దరిని చేర్చవా… నీ ప్రేమలోన నీడనీయవా
కన్నులు కన్నది సగమే… నీ ఊహలో ఉన్నది జగమే
వగల సెగలే రగిలే…
అయ్యయ్యయ్యో ఆనందమే… ఏదో ఏదో ఆరంభమే
కన్నులు ఉన్నవి.. నిన్ను విడువక చూచుటకే కాదా
హృదయమున్నది నిడు బాటలో పరచనే కాదా
వస్తాను నీతో అడుగు జాడనై… ఉంటాను నీకు తోడు నీడనై
బుగ్గల మందారాన్ని… నీ సిగ్గుల సింధూరాన్ని కానా రానా మైనా
అయ్యయ్యయ్యో ఆనందమే… ఏదో ఏదో ఆరంభమే
వన్నె వాన విల్లులే… నన్ను కోరి చేరెనే
వలపు పూల జల్లులో… తనువు తడిసి పోయెనే
ఏదో ఒక ఆశ… నీవే నా శ్వాస
అయ్యయ్యయ్యో…