Menu Close

Business Ideas in Telugu: సొంత ఊళ్లో ఉంటూనే నెలకు లక్ష ఆదాయం

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Business Ideas in Telugu: గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫామ్ నడుపుకుంటూ ప్రతి నెలా లక్ష వరకు సంపాదించవచ్చు. మరి ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం? ఆదాయం ఎంత వస్తుంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాల కంటే సొంత వ్యాపారం పైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో.. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. ప్రైవేట్స్ జాబ్స్‌లో ఒత్తిడి ఎక్కువ. ఊరికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది యువత బిజినెస్‌పై దృష్టిసారిస్తున్నారు.

డబ్బు లేకున్నా.. లోన్ తీసుకొని అయినా.. వ్యాపారం చేసేందుకు ఇష్టపడుతున్నారు. మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తుంటే.. అందుకు పౌల్ట్రీ ఫామ్ (Poultry Farm) బిజినెస్ చక్కటి అవకాశం. దీనికి రోజుకు 4 గంటలు కేటాయిస్తే చాలు. ఆ తర్వాత ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. పెట్టుబడి కాస్త ఎక్కువగా ఉన్నా.. ఇబ్బందేం లేదు. బ్యాంకులు రుణాలు ఇస్తాయి.

సాధారణంగా 10 వేల కోళ్ల సామర్థ్యం గల షెడ్డు నిర్మాణానికి దాదాపు రూ.10-15 లక్షల వరకు ఖర్చవుతుంది. షెడ్డు గోడలు, ఐరన్ మెష్, ఇతర సామాగ్రి మొత్తం ఇందులోనే వస్తాయి. ఊరికి దూరంగా పొలాల్లో నిర్మించుకుంటే ఉపయోగం ఉండదు. రోడ్డు సౌకర్యం ఉన్నచోటే పౌల్ట్రీ షెడ్‌ను నిర్మించాల్సి ఉంటుంది.

షెడ్డు నిర్మాణం పూర్తైన తర్వాత మీరు ఏదేని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. వెన్‌కాబ్, సుగుణ, స్నేహ వంటి పౌల్ట్రీ కంపెనీలతో అగ్రీమెంట్ చేసుకోవచ్చు. సదరు కంపెనీ వారే మీకు బ్రాయిలర్ కోడి పిల్లలు ఇస్తారు. రవాణా ఖర్చులు కూడా వారివే. ఆ తర్వాత వాటికి అవసరమైన దాణా, రోగాల బారినపడకుండా ఇంజెక్షన్స్ కూడా వారే సప్లై చేస్తారు. మీరు కేవలం వాటిని పెంచి.. ఇవ్వాల్సి ఉంటుంది. అలా పెంచినందుకు.. కమిషన్ ఇస్తారు. కోళ్లు ఒక సైజుకు వచ్చిన తర్వాత.. కంపెనీ వారే వాహనాన్ని మీ షెడ్డు వద్దకు పంపించి.. కోళ్లను తీసుకెళ్తారు.

ఆదాయం వివరాలు:

మీరు ఒకవేళ 10 వేల సామర్థ్యంతో పౌల్ట్రీ ఫామ్ పెట్టారని అనుకుందాం. దాదాపు 45 రోజులకు బ్యాచ్ పూర్తవుతుంది. కోళ్లు ఒకటిన్నర నుంచి రెండు కేజీల బరువు పెరుగుతాయి. ఎలాంటి మోర్టాలిటీ లేకుండా అన్ని బతికి.. ఒక్కొక్కటి 2 కేజీల చొప్పున పెరిగాయని భావిస్తే.. అప్పుడు మీ షెడ్‌లో ఉన్న మొత్తం కోళ్ల బరువు 20వేల కేజీలు. కంపెనీ వారు ఒక్కొ కేజీకి రూ.3 చొప్పున కమిషన్ చెల్లిస్తే.. మీకు రూ.60వేలు వస్తాయి.

ఖర్చులకు రూ.10 వేలు పోయినా.. రూ.50వేలు మిగులుతాయి. కొన్ని కంపెనీలు రూ.4 కూడా ఇస్తాయి. అప్పుడు బ్యాచ్‌కు రూ.80 వేల వరకు వస్తాయి. ఈ లెక్కన నెలకు రూ.50వేలు మిగులుతాయి. మీ వ్యాపారాన్ని మరింత విస్తరించి.. ఇంకో షెడ్డు ఏర్పాటు చేసుకుంటే… లక్ష వరకు సంపాదించవచ్చు.

మీరు పౌల్ట్రీ కంపెనీలతో కాంట్రాక్ట్ ఒప్పందం కాకుండా… సొంతంగా కూడా బిజినెస్ చేయవచ్చు. అంటే సొంతంగా కోడిపిల్లలు కొని.. వాటిన పెంచి. .మీరే అమ్ముకోవాల్సి ఉంటుంది. ఐతే దీనికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కారణంతో కోడిపిల్లలు మరణిస్తే.. భారీగా నష్టం వస్తుంది.

ఒకవేళ మార్కెటింగ్ చేసుకోలేకపోయినా ఇబ్బందులు తప్పవు. ఐతే అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. ఇందులోనే ఎక్కువ లాభాలు వస్తాయి. ఒక్క బ్యాచ్‌లోనే లక్షల్లో సంపాదించవచ్చు. కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదనుకుంటే.. పౌల్ట్రీ కంపెనీలతో కలిసి పనిచేయడం ఉత్తమం. అన్నీ వారే చూసుకుంటారు. మీరు జస్ట్.. కోళ్లను పెంచి.. ఇస్తే చాలు.

SUBSCRIBE FOR MORE

ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Business Ideas in Telugu
Best business ideas
New business ideas
Online business ideas
Startup ideas
Business ideas in India
Business ideas for women
Low investment business ideas
Small business ideas from home

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading