Greatness of Hindu Culture
కూతురా..? కోడలా..? ఇద్దరిలో ఎవరు ప్రధానం?
అనే ప్రశ్నకు ‘కోడలే’ అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం.
ఎందుకో తెలుసా..?
కొడుకు పెట్టె పిండాలకన్నా, కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది కోడలి గొప్పతనం.
చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ ‘త్యాగశీలి‘ కోడలు..!
కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే ‘గుణశీలి‘ కోడలు..!
తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల ‘భాగ్యశీలి‘ కోడలు..!!
తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవ చేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే ‘శ్రమజీవి‘ కోడలు..!!
కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మ కోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామ గారు. ఎందుకో తెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా! కోడలు..!!
కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం *నాంది శ్రాద్ధం* పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్ప కోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య. ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి..!!
ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళి పోతుంది.
ఈ పోస్ట్ ని ప్రతి కోడలకి, కూతురికి షేర్ చెయ్యండి.
Interesting Aspects of Hinduism?
Greatness of Hindu Culture?
Amazing Facts About Hinduism?
Interesting stories in Hinduism?
What is the Greatness of Hindu Culture.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.