ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఇంతకు నువ్వెవరు… వరసకు నాకెవరూ
అంతగా గుచ్చి గుచ్చి… చెప్పేటందుకు నేనెవరూ
ఇంతకు ముందెవరు… ఇంతగా నాకెవరూ
చెంతకు వచ్చి వచ్చి… చెప్పినవారే లేరెవరూ
ఒక నిమిషం కోపముతో… మరు నిమిషం నవ్వులతో
నను మురిపిస్తావో… మరిపిస్తావో ఎందుకు
నీ పంతము ఏమిటని… ఏ బంధము మనది అని
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు..!!
ఇంతకు నువ్వెవరు… వరసకు నాకెవరూ
అంతగా గుచ్చి గుచ్చి… చెప్పేటందుకు నేనేవరూ
ఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ
ఎందుకో ఏమిటో… నేను చెప్పలేనుగానీ
కలిశావు తియ్యనైన వేళ..
చనువుతో చిలిపిగా… నీవే మసులుతుంటే నాతో
మరిచాను గుండెలోని జ్వాల…
ఓ తొలకరి స్నేహమా, నేస్తమా… ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో… కాలమే నిలిచి చూస్తున్నదీ
ఇంతకు నువ్వెవరు… వరసకు నాకెవరూ
అంతగా గుచ్చి గుచ్చి… చెప్పేటందుకు నేనెవరూ
ఎవరని చూడక… నాకై పరుగు తీస్తు ఉంటే
నీ పేరే ఆశ రేపే నాలో…
నువ్వలా కసురుతూ… నాకే అదుపు నేర్పుతుంటే
చూశాలే నన్ను నేను నీలో…
ప్రియమైన సమయమా, గమనమా… చెప్పవే అతనికి
ఈ చిరు చిరు పయనమే… మధురమై నిలిచిపోతుందనీ
ఇంతకు నువ్వెవరు… వరసకు నాకెవరూ
అంతగా గుచ్చి గుచ్చి… చెప్పేటందుకు నేనెవరూ
ఒక నిమిషం కోపముతో… మరు నిమిషం నవ్వులతో
నను మురిపిస్తావో… మరిపిస్తావో ఎందుకు
నీ పంతము ఏమిటని… ఏ బంధము మనది అని
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు..???