Menu Close

దేశానికి కాబోయే రాష్ట్రపతి.! ఎవరీ ద్రౌపది ముర్ము – Draupadi Murmu?

Draupadi Murmu next president of India.?

బీజేపీ పార్లమెంటరీ కమిటీ భేటీ అనంతరం ఎన్డీఏ అభ్యర్థిగా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము ని ఎంపిక చేశారు. ఎన్డీఏ పక్షాలన్నింటితో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం నియమించిన కమిటీ దాదాపు 20 పేర్లను పరిశీలించింది. చివరిగా 64 ఏళ్ల ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజన వర్గాల వారికి లభించలేదంటూ ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్లు తెలిపారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని.. మంత్రిగా, గవర్నర్​గా మెరుగైన సేవలు అందించారని కొనియాడారు.

Draupadi Murmu next President of India
  • ద్రౌపది ముర్ము (64) ఒడిశాలోని మయూర్​భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్‌ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు.
  • ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్​చరణ్ ముర్ము. మర్ము దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అనుకోకుండా ఈ మద్య కాలంలో ద్రౌపది ముర్ము తన భర్త, ఇద్దరు కుమారులను ఓ ప్రమాదంలో కోల్పోయారు.
  • ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము.. అనంతరం బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొందారు.
  • 1997లో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముర్ము.. రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలపాటు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Limited Offer, Amazon Sales
Fire-Boltt Smart Watch at Lowest Price
Buy Now

  • ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ – బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మార్చి 6, 2000 నుండి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం, రవాణా మంత్రిగా పనిచేశారు.
  • ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.
  • 2010, 2013లో మయూర్‌భంజ్‌ బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలిగా కొనసాగారు.
  • జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు గవర్నర్‌గా సేవలందించారు.
Draupadi Murmu next President of India
  • ప్రస్తుతం ద్రౌపది ముర్ము రాష్ట్రపతి రేసులో నిలిచిన తొలి గిరిజన మహిళగా నిలిచారు.
  • జూన్ 25న ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించనున్నారు.
Draupadi Murmu next President of India

దేశానికి గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారంటూ మోడీ ట్వీట్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక కావడం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ద్రౌపది ముర్ము తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారని కొనియాడారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారత కోసమే కృషి చేశారన్నారు.

ఆమెకు విశేష పరిపాలన అనుభవం ఉందన్నారు. ద్రౌపది ముర్ము మనదేశానికి గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారన్న విశ్వాసం ఉందని ప్రధాని మోడీ అన్నారు. విధానపరమైన అంశాలపై ఆమెకున్న అవగాహన, దయతో కూడిన ఆమె స్వభావం మనదేశానికి ఎంతో మేలు చేస్తుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

Who is Draupadi Murmu? President of India?

Like and Share
+1
5
+1
1
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Limited Offer, Amazon Sales
Boult Earbuds at Just Rs.799
Buy Now

Subscribe for latest updates

Loading