ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kalalu Kane Kaalaalu Lyrics In Telugu – 7/G Brundhavana Colony – కలలు కనే కాలాలు లిరిక్స్
కలలు కనే కాలాలు… కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా… ఆఆ
చూపు రాయి లేఖలు… దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా
ఇది చేరువ కోరే తరుణం… ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం… వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువం…నిజ కలలతో తమకమ రూపం
వీళ్ళు కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యమో
లోకంలో తియ్యని భాష… హృదయంలో పలికే భాష
మెల్లమెల్లగ వినిపించే ఘోషా… ఆఆ
కలలు కనే కాలాలు… కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయి లేఖలు… దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా
తడికాని కాళ్ళతోటి… కడలికేది సంబంధం
నే వేరు నువ్వేరంటే… చెలిమికేది అనుబంధం
ఎగరలేని పక్షికేలా… పక్షి అనెడి ఆ నామం
తెరవలేని మనస్సుకేలా… కలలు గనే ఆరాటం
ఒంటరిగా పాదాలు… ఏమి కోరి సాగినవో
జ్యోతి వెలిగించిన… చేతి కొరకు వెతికినవో
కలలైనా కొన్ని హద్దులు ఉండును… స్నేహంలో అవి ఉండవులే
ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే… ఆపుట ఎవరికి సాధ్యములే
కలలు కనే కాలాలు… కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయి లేఖలు… దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా
ఏమైందో ఏమో గాలికి… తేమ కాస్త తగ్గెనులే
ఏకాంతం పూసుకొని… సంధ్య వేళ పిలిచెనులే
తెల్లవారుజాములన్నీ… నిద్రలేక తెలవారే
కనులు మూసి తనలో తానే… మాట్లాడ తోచెనులే
నడిచేటి దారిలో… నీ పేరు కనిపించా
గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించే
అపుడపుడు చిరు కోపము రాగా… కరిగెను ఎందుకు మంచులాగ
భూకంపం అది తట్టుకోగలము… మది కంపం అది తట్టుకోలేం
కలలు కనే కాలాలు… కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయి లేఖలు… దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా.. ..
Kalalu Kane Kaalaalu Lyrics In Telugu – 7/G Brundhavana Colony – కలలు కనే కాలాలు లిరిక్స్