ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఎలా ఎలా ఎలా ఎలా… ఎలా తెలుపను…
ఎదలోని ప్రేమను… మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా… ఎలా తెలుపను…
ఎదలోని ప్రేమను… మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపనా… నేలమీద సిగ్గుముగ్గు వేసి చూపనా
వాలుజడల కాగితాన… విరజాజులు అక్షరాలూ…
ఏర్చి కూర్చి చూపనా..!!
ఎలా ఎలా ఎలా ఎలా… ఎలా తెలుపను…
ఎదలోని ప్రేమను… మృదువైన మాటను
రామచిలుక గోరువంక… బొమ్మగీసి తెలుపనా
రాధాకృష్ణుల వంక… చేయి చూపి తెలుపనా
చిరునవ్వుతో తెలుపనా… కొనచూపుతో తెలుపనా
నీళ్ళు నమిలి తెలుపనా… గోల్లుకొరికి తెలుపనా
తెలుపనని తెలుపనా… ఆఆ ఆ ఆ
ఎలా ఎలా ఎలా ఎలా… ఎలా తెలుపను…
ఎదలోని ప్రేమను… మృదువైన మాటను
కాలి వేలు నేలమీద రాసి చూపనా…
నా చీరకొంగుతోటి… వేళు చుట్టి చెప్పనా
కూనలమ్మ పాటలో… రాయబారం పంపనా
గాలికైన తెలియకుండ… మాట చెవిని వేయనా
నాలో ప్రాణం నీవనీ…
ఎలా ఎలా ఎలా ఎలా… ఎలా తెలుపను…
ఎదలోని ప్రేమను… మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా… ఎలా తెలుపను…
ఎదలోని ప్రేమను… మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపనా… నేలమీద సిగ్గుముగ్గు వేసి చూపనా
వాలుజడల కాగితాన… విరజాజులు అక్షరాలూ…
ఏర్చి కూర్చి చూపనా..!!
ఎలా ఎలా ఎలా ఎలా… ఎలా తెలుపను…
ఎదలోని ప్రేమను… మృదువైన మాటను
ఎదలోని ప్రేమను… మృదువైన మాటను