Menu Close

జంట అరటిపళ్ళను తినకూడదా..?

జంట అరటిపళ్ళను తినకూడదా? ఒకవేళ తింటే ఏమౌతూంది…? దేవత పూజకు వాడవచ్చా?

double banana

ఆరటిపళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళ వ్యాపారి అరటి గెలలోంచి అరటి హస్తాలు కోస్తున్నప్పుడు మన కళ్ళు ఆ హస్తం మీదే నిలుస్తాయి. ఆ హస్తంలో ఒకదానితో మరొకటి అతుక్కుపోయి వున్న కవల అరటిపళ్ళుగానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ వుంటే ఆ కవల పండు వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం? కవల అరటిపళ్ళు పిల్లలు తినకూడదు.

పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు… కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు…. ఇలాంటి నమ్మకాలు మనకి వుంటాయి. అందుకే కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం. అయితేచాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి.

వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ వుంటారు. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టడం సంగతి అలా వుంచితే, కవల అరటిపళ్ళను దేవతలకు పెట్టకూడదా? ఈ ప్రశ్నకు పండితులు ఇలా సమాధానమిస్తున్నారు.. ‘‘అరటి చెట్టు అంటే మరెవరో కాదు..

సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు.

అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడటంతో దేవుడికి నైవేద్యంగా వుండే అర్హతను ఆయన ఇచ్చారు. అంతపవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదు.

కవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు. అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదు. ఎందుకంటే కవల అరటిపండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు కదా..

అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టామంటే చాలా ఎబ్బెట్టుగా వుంటుంది. అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటిపళ్ళను మినహాయించడం మంచింది’’.

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading