ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
బల్బు కనిపెట్టినోడికే
బ్రతుకే సిమ్మ సీకటి అయిపోయిందే
సెల్లు ఫోను కంపినోడికే
సిమ్ము కార్డే బ్లాక్ అయిపోయిందే
రూట్ చూపే గూగుల్ అమ్మనే
ఇంటి రూట్ నే మర్చిపోయిందే
రైట్ టైం చెప్పే వాచుకే
బాడ్ టైమే స్టార్ట్ అయిపోయిందే
అగ్గి పుల్ల నేనే మెల్లగా కాల్చుతుంటే
సొంత కొంపనే ఫుల్లుగా అంటుకున్నదే
పాస్టు లైఫులో నేను చెప్పిన ఎదవ మాటే
బ్రైట్ ఫ్యూచరే నీల తగలెడుతుందే
ఒగ్గేసి పోకే అమృత
నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెప్తున్న అమృత
నువ్వు వెళ్ళిపోతే ఒంటరైపోతా
ఒగ్గేసి పోకే అమృత
నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెప్తున్న అమృత
నువ్వు వెళ్ళిపోతే ఒంటరైపోతా
ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చి బుజ్జగించా
చిన్న పిల్లవు కాదే
ఫెవికాల్ కన్నా గట్టిగ ఫిక్స్ అయ్యి
చుక్కలు చుపిస్తావే
చెంప మీద ఒక్కటిద్దామంటే
చెయ్యి రావట్లేదే
హాగ్ చేసుకొని చెపుదామంటే
బగ్గుమంటావన్న భయమే
బండ రాయి లాంటి మైండు సెట్ మార్చి
మనసు తోటి లింక్ చేస్తే బాగు పడతావే
నీ హార్ట్ గేట్ తెరిచి నీలో తొంగి చూడే
నా బొమ్మనే గీసి ఉంది నా పై లవ్ ఉందే
ఒగ్గేసి పోకే అమృత
నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెప్తున్న అమృత
నువ్వు వెళ్ళిపోతే ఒంటరైపోతా
Movie: Solo Brathuke So Better
Song: Amrutha (Break up song)
Lyrics: Kasarla Shyam
Music: Thaman
Singer: Nakasj Aziz
Music Label: Sony Music.