ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నా కళ్ళలో కొత్త నీలి రంగు పొంగేనే
అవి నిన్ను చూసినప్పుడే
నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టేనే
నువ్వు నన్ను చూసినప్పుడే
నువ్వెళ్ళే దారంతా పచ్చ రంగేసినట్టుందే
నీవెంటే నేనుంటే పాదాలకె పసుపు పుసిందే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్ని కొత్త రంగులే
ఓ నవ్వు నువ్వు విసిరావు
ఆ క్షణము రంగు తెలుపు
నా కాటుకిష్టం అన్నావో
ఆ పూట రంగు నలుపు
నీ చేతి స్పర్శే తాకిందో
నా ఒంటి రంగు చెంగాబి
నీ మౌనమే ఓ ముల్లైతే
నా పలుకు రంగు గులాబీ
జగామాడే రంగేళి ఏడాదికోసారి
నాలో ఈ హోళిలే నిమిషానికోసారి నీ వల్లే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్ని కొత్త రంగులే
నువు పలకరించే ప్రతిసారి
ఆ పులకరింతది ఏ రంగో
నీ మెప్పు పొందే ప్రతిసారి
నా గొప్పతనమది ఏ రంగో
నువు కోపగించె సమయంలో
నా బుజ్జగింపుది ఏ రంగో
నువు విడిచి వెళ్లే వేళల్లో
నా ఏదన వేదనదే రంగో
హరివిల్లే ఆ ఏడూ రంగుల్ని మించదులే
నా మనసే నీ వల్లే వేవేలా
రంగుల్ని వెదజల్లే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
పేరులేనివెన్నో కొత్త రంగులే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
పేరులేనివెన్నో కొత్త రంగులే
Song Details:
Movie: Rangde
Song: Rangule
Lyrics: Shreemani
Music: Devi Sri Prasad
Singer: Shweta Mohan
Music Label: Aditya Music.