Menu Close

అమ్మను మించి దైవమున్నదా-Telugu Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Movie: 20వ శతాబ్దం (19 May 1990)
Starring: Suman. Lizy
Music: J V Raghavulu
Lyrics: Dr. C. Nayarana Reddy
Singers: S P Balasubramanyam, Susheela
Producer: R. V.Vijaya Kumar
Director: Kodi Ramakrishna
Song Label: Santosh Videos HD

అమ్మను మించి దైవమున్నదా… ఆత్మను మించి అద్దమున్నదా
అమ్మను మించి దైవమున్నదా… ఆత్మను మించి అద్దమున్నదా…

జగమే పలికే శాశ్వత సత్యమిదే… అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా… ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే… అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే…

రఘురాముడిలాంటి కొడుకు ఉన్నా… తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి
సుగుణ రాశి సీతలాగ తాను… కోటి ఉగాదులే నా గడపకు తేవాలి…

మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే… మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే…
ఈ లోగిలి కోవెలగా… మారాలి…

అమ్మను మించి దైవమున్నదా… ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే…
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే… అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే…

తప్పటడుగులేసిన చిననాడు… అయ్యో తండ్రీ అని
గుండె కద్దుకున్నావు
తప్పటడుగులేస్తే ఈనాడు… నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు…

నింగికి నిచ్చెనలేసే మొనగాడినే… నింగికి నిచ్చెనలేసే మొనగాడినే…
ఐనా నీ ముంగిట… అదే అదే పసివాడినే…

అమ్మను మించి దైవమున్నదా… ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే…

అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే… అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే… ||2||

Like and Share
+1
3
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading