Menu Close

మేఘమా మరువకే..మోహమా విడువకే-Telugu Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

మేఘమా మరువకే… మోహమా విడువకే…
మాఘమాస వేళలో… మల్లెపూల మాలగా
మరుని కూడి మెల్లగా… మరలి రావే చల్లగా
మదిలో మెదిలే మధువై…

మేఘమా మరువకే… మోహమా విడువకే…

నిదుర కాచిన కన్నె పానుపే… రారా రమ్మంటుంటే..!
కురులు విప్పిన అగరఒత్తులే… అలకలు సాగిస్తుంటే
సిగ్గే ఎరుగని రేయిలో… తొలి హాయిలో అలివేణి
రవికే తెలియని అందము… అందించనా నెలరాజా
కలలా… అలలా… మెరిసి…

మేఘమా మరువకే… మోహమా విడువకే…

గడుసు ఒడుపులే… పరుపు విరుపులై గిచ్చే సందడిలోన
తడవ తడవకి పెరుగుతున్నది… ఏదో మైకం భామా
మరుగే ఎరుగని కోనలో… ఆ మోజులో మహరాజా
నలిగే మల్లెల సవ్వడి… వినిపించనా నెరజాణ
జతగా… కలిసి… అలిసీ…

మేఘమా మరువకే… మోహమా విడువకే…

Movie: Seetharatnam Gari Abbayi (03 September 1992)
Director: E.V.V Satyanarayana
Singers: S P Balasubramanyam, KS Chitra
Music: Raj-Koti
Lyrics: Bhuvana Chandra
Star Cast: Vinod Kumar, Vanisree, Roja, Satyanarayana
Producer: Boorugupalli Shiva Ramakrishna
Music Lable: T-Series Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading