Yamahoo Nee Yamaa Yamaa Andham Lyrics in Telugu – యమహో నీ యమ యమ అందం
యమహో నీ యమ యమ అందం…
చెలరేగింది ఎగాదిగా తాపం…
నమహో నీ ఝమ ఝమ వాటం…
సుడిరేగింది ఎడాపెడా తాళం…
ఫోజుల్లో నేను యముడంత వాణ్ణి… మొజుల్లో నీకు మొగుడంత వాణ్ణి
అల్లారు ముద్దుల్లో గాయం… విరబూసింది పువ్వంటి ప్రాయం…
యమహో నీ యమ యమ అందం…
చెలరేగింది ఎగాదిగా తాపం…
నమహో నీ ఝమ ఝమ వాటం…
సుడిరేగింది ఎడాపెడా తాళం…
నల్లని కాటుక పెట్టి… గాజులు పెట్టి, గజ్జ కట్టి…
గుట్టుగా సెంటే కొట్టి… ఒడ్డాణాలే ఒంటికి పెట్టి…
పెట్టు పోతా వద్దే చిట్టెంకీ… చెయ్యి పట్టిన్నాడే కూసే వల్లంకి
పెట్టేది మూడే ముళ్ళమ్మి… నువు పుట్టింది నాకోశమమ్మి…
ఇక నీ సొగసు నా వయసు… పేనుకునే ప్రేమలలో…
యమహో… నీ యమ యమ అందం…
చెలరేగింది ఎగాదిగా తాపం…
నమహో నీ ఝమ ఝమ వాటం…
సుడిరేగింది ఎడాపెడా తాళం…
పట్టె మంచమేసి పెట్టి, పాలుబెట్టి, పండు బెట్టి…
పక్క మీద పూలుగొట్టి… పక్క పక్కలొళ్ళో పెట్టి…
ఆకులో వక్కబెట్టి, సున్నలెట్టి, చిలక చుట్టి…
ముద్దుగా నోట్లో బెట్టి… పరువాలన్నీ పండ బెట్టి…
చీర గుట్టు సారెబెట్టి… సిగ్గులన్ని ఆరబెట్టి
కళ్ళలోన ఒత్తులెట్టి… కౌగిలింత మాటుబెట్టి…
ఒట్టే పెట్టి వగ్గేసాక మామా… నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమ
పెట్టెయ్యి సందె సీకట్లోన… నన్ను కట్టేయ్యి కౌగిలింతల్లోన
ఇక ఆ గొడవ, ఈ చొరవ ఆగవులే… అలజడిలో
యమహో… నీ యమ యమ అందం…
చెలరేగింది ఎగాదిగా తాపం…
నమహో నీ ఝమ ఝమ వాటం…
సుడిరేగింది ఎడాపెడా తాళం…
ఫోజుల్లో నేను యముడంతవాణ్ణి… మొజుల్లో నీకు మొగుడంతవాణ్ణి
అల్లారు ముద్దుల్లో గాయం… విరబూసింది పువ్వంటి ప్రాయం…
యమహో… నీ యమ యమ అందం…
చెలరేగింది ఎగాదిగా తాపం…
Movie: Jagadeka Veerudu Athiloka Sundari (09 May 1990)
Director: K. Raghavendra Rao
Singers: S P Balasubramanyam, S Janaki
Music: Ilaiyaraaja
Lyrics: Veturi Sundararama Murthy
Cast: Chiranjeevi, Sridevi
Producer: C. Ashwini Dutt
Music Lable: Aditya Music
Yamahoo Nee Yamaa Yamaa Andham Lyrics in Telugu – యమహో నీ యమ యమ అందం
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.