Menu Close

పల్లె కన్నీరు బెడుతుందో కనిపించని కుట్రల-Telugu Folk Song Lyrics #4

More Telugu Folk Songs

పల్లె కన్నీరు బెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బంది అయ్ పోతుందో కనిపించని కుట్రలా
పల్లె కన్నీరు బెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బంది అయ్ పోతుందో కనిపించని కుట్రలా
పల్లె కన్నీరు బెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బంది అయ్ పోతుందో కనిపించని కుట్రలా

కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను
కమ్మరి కొలిమిల దుమ్ము బెరెను
పెద్ద బాడిస మోద్దుబారినది సాలెల మగ్గం సడుగులిరిగినది
చేతివృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా
అయ్యో గ్రామస్వరాజ్యం గంగలొనబాయె ఈ దేశంలోన

మడుగులన్ని అడుగంటిపోయినవి
బావులు సావుకు దగ్గరయ్యినవి
వాగులు వంకలు ఎండిపోయినవి
సాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్దబోరు పొద్దంత నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులేందుకేండే నా పల్లెల్లోన

ఈదులన్ని వట్టి మొద్దులయ్యినవి
ఈత కల్లు బంగారమయ్యినది
మందు గలిపిన కల్లును దాగిన మంది కండ్ల నిన్డూసులయ్యినవి
సల్లని బీరు విస్కిలేవరుబంపే నా పల్లెల్లోకి
అరె బస్సున పొంగే పెప్సీ కోలా వచ్చే నా పల్లెల్లోకి
పల్లె కన్నీరు బెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బంది అయ్ పోతుందో కనిపించని కుట్రలా

పరక సేపలకు గాలాలేసే
తురకల పొరలు యాడికిబోయిరి
లారిలల్ల క్లీనర్లయ్యిర పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
తల్లి దూదుసేమియకు దూరమయ్యినారా
సాయబుల పోరలు
ఆ బెకరి కేఫులో ఆకలి తీరిందా ఆ పట్టణాలలో
పల్లె కన్నీరు బెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బంది అయ్ పోతుందో కనిపించని కుట్రలా

Lyrics & Singer : Goreti Venkanna

More Telugu Folk Songs

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading