Menu Close

Taladinchuku Lyrics in Telugu – Cameraman Ganga Tho Rambabu


Taladinchuku Lyrics in Telugu – Cameraman Ganga Tho Rambabu

Taladinchuku Lyrics in Telugu – Cameraman Ganga Tho Rambabu

తలదించుకు బతుకుతావా
తల ఎత్తుకు తిరగలేవా
తలరాతను మార్చుకోవా సిగ్గనేది లేదా
ఒకడిగ నువు పుట్టలేదా
ఒకడిగ నువు చచ్చిపోవా
ఒకడిగ పోరాడలేవా నిద్రలేచి రారా
నీ ఓటుని నీ వేటుకె వాడుతుంటే వింతగా
జుట్టుపట్టి రచ్చకీడ్చి నీలదీయవనేరుగా
ఉడుకెత్తిన నెత్తురె ఒక నిప్పుటేరులాగ
కదలిరా… కదలిరా… కదలిరా…
పనైపోద్ది పనైపొద్ది పనైపొద్ది… రారా

చరణం: 1
నీ ఇంటి చూరువిరిగి మీదపడక ముందే
నీ గుండెలచప్పుడు నిను ఛీ కొట్టకముందే
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్…
దేహానికి హాని అంటే వైద్యమిచ్చుకోవా
దేశానికి జబ్బుచేస్తే నీళ్లునములుతావా
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్…

చరణం: 2
తొలి మనిషెపుడొక్కడేగ
తొలి అడుగెపుడొంటరేగ
తుదిపోరుకు సిద్ధమైన తొలివాడిగ రారా
బిగబట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రమయ్యి
నడినెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించిలేరా
పోరాడని ప్రాణముంటే అది ప్రాణమే కాదటా
ఊపిరినే ఒలకబోసి ఎగరెయ్యర బావుటా
కణకణకణ ప్రతికణమున
జనగణమన గీతమయ్యి రా…
కదలిరా… కదలిరా… కదలిరా…
పనైపోద్ది పనైపొద్ది పనైపొద్ది… రారా

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading