8 వసంతాలు డైలాగ్స్ – 8 Vasanthalu Movie Dialogues in Telugu – 2025
మగాడి ప్రేమకి సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్య నగరాలున్నాయి. ఆడదాని ప్రేమకేమున్నాయి… మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్పా.
నా ఆనందాన్ని, మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో కాకుండా… మీరు ఎదురుగా ఉన్నప్పటి క్షణాల్ని ఆస్వాధించడంలో వెతుక్కున్నా.

చూడమ్మా ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు..
అంత్యక్రియలకు వాళ్లు పనికి రారు.
“ఆడవాళ్లు పనికి రారా..
పేగు పంచి ప్రాణం పోయగలిగిన మేము,
చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా..?”
ఎవరి తుఫానులు వాళ్ళకుంటాయి లోలోపల.
ఎవరి తలరాతలు వాళ్లే రాసుకోవాలి.
ప్రేమ… జీవితంలో ఒక దశ మాత్రమే. అదే దిశ కాదు.
సుఖాలే కాదు… కలలు కూడా పంచుకోవాలి.
నీ చేతిలో అక్షరం ఉంది… అది నీ ఆయుధం కావాలి.
అక్షరమే నిన్ను ఏంచుకున్నట్టుంది.
బంధం మంచిదే. అటాచ్మెంట్ కాదు.
అందం అంటే గుణం. మంచితనం.
మాట్లాడేప్పుడు మాటల్లో తూకం ఉంటుంది, కానీ మౌనంలోకి వెళ్ళాక ఆ మాటల బరువు తెలుస్తుంది.
నేను లోపల జరిగిన హిరోషిమాకి బయట కన్నీళ్లతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా .
పేరుని సంపాదించుకునేంత స్ఫూర్తి… నీకు రావాలి.
ఈ ప్రపంచంలో దేన్నీ సొంతం చేసుకోవాలని ఆరాటపడకు. ఆస్వాదించడంలో ఉన్న సంతోషం… సొంతం చేసుకోవడంలో ఉండదు.
50 Priyanka Mohan Latest HD Images – ప్రియాంక మోహన్ పిక్స్