ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
8 Interesting Facts about Oscar Awards in Telugu
1. ఎక్కువ సార్లు ఆస్కార్ పొందిన సినిమా ఏది?
సినిమా కేటగిరీలో మూడు సినిమాలు సంయుక్తంగా అత్యధిక సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాయి.
బెన్-హర్ (1959),
టైటానిక్ (1997),
ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ద కింగ్ (2003) సినిమాలు
11 చొప్పున ఆస్కార్లను తమ ఖాతాలో వేసుకున్నాయి.
వీటి తర్వాత గాన్ విత్ ద విండ్ (1939),
వెస్ట్ సైడ్ స్టోరీ (1961) సినిమాలకు 10 చొప్పున అవార్డులు లభించాయి.
8 Interesting Facts about Oscar Awards in Telugu
2. ఆస్కార్ అవార్డ్ బొమ్మ తయారు చెయ్యడానికి ఎంత కర్చు అవుతుంది?
ఆస్కార్ అవార్డు ప్రతిమ పసిడి వర్ణంలో మిలమిల మెరిసిపోతున్నప్పటికీ,
అందులో ఉండేదంతా బంగారం కాదు. దీనిని కాంస్యంతో తయారు చేసి, 24 క్యారట్ బంగారంతో పూత పూస్తారు.
50 ఆస్కార్ ప్రతిమలు తయారుచేయాలంటే సాధారణంగా మూడు నెలలు పడుతుంది.
మీరు నమ్మరు కానీ దాని విలువ కేవలం ఒక అమెరికా డాలర్ మాత్రమే.
అంతేకాకుండా అవార్డు గ్రహీతలు దీన్ని అమ్మడానికి వీల్లేదు.
1950 నుంచి అవార్డు గెలుచుకున్నవారు ఒక కాంట్రాక్టుపై సంతకం చేయాలి.
ఈ కాంట్రాక్టు ప్రకారం మొదట అకాడమీని సంప్రదించకుండా ఈ అవార్డును అమ్మకూడదు.
3. ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కువ అవార్డులు గెలుచుకున్న వ్యక్తి ఎవరు?
వాల్ట్ డిస్నీ. 22 సార్లు విజేతగా నిలిచారు.
యానిమేషన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసిన వాల్ట్ డిస్నీ 59 సార్లు ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.
4. మరణించిన తర్వాత ఆస్కార్ అందుకున్న కళాకారులు ఎవరు?
ఆస్కార్ చరిత్రలో కేవలం ఇద్దరు కళాకారులకు మాత్రమే మరణం తర్వాత ఆస్కార్ లభించింది.
1976లో బ్రిటిష్ నటుడు పీటర్ ఫించ్, నెట్‌వర్క్ సినిమాకు గానూ ‘ఉత్తమ నటుడు’ కేటగిరీలో విజేతగా నిలిచారు.
ఇది జరిగిన మూడు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియన్ నటుడు హీత్ లెడ్జర్‌కు,
బ్యాట్‌మన్: ది డార్క్ నైట్ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో అవార్డు వరించింది.
60 ఏళ్ల వయస్సులో గుండె నొప్పితో ఫించ్ మరణించగా,
డ్రగ్ పాయిజన్ కారణంగా లెడ్జర్ 28 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.
5. ఆస్కార్ గెలుచుకున్న మహిళా డైరెక్టర్లు ఎవరు?
ఇప్పటివరకు ముగ్గురు మహిళలు ‘బెస్ట్ డైరెక్షన్’ కేటగిరీలో అవార్డు అందుకున్నారు.
‘ఫియర్ జోన్’ సినిమాకు అమెరికా డైరెక్టర్ బిగ్లో,
నోమ్యాడ్‌ల్యాండ్ సినిమాకు చైనాకు చెదిన చో జావో,
‘ది పవర్ ఆఫ్ గాడ్’ సినిమాకు జాన్ కాంపియాన్ ఈ అవార్డును అందుకున్నారు.
6. నాన్ ఇంగ్లిష్ సినిమా కేటగిరీలో అత్యధిక సార్లు అవార్డు గెలుచుకున్న దేశం ఏది?
ఇటలీ. 14 సార్లు ఈ అవార్డు అందుకుంది.
నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో ఇటలీ ఇప్పటివరకు
7. ఎక్కువసార్లు ఆస్కార్ పొందిన నటి ఎవరు?
అమెరికాకు చెందిన కేథరీన్ హాప్‌బర్న్,
1934-1982 మధ్య 4 సార్లు ‘బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్’ కేటగిరీలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
8. ఎక్కువ సార్లు ఆస్కార్ పొందిన నటుడు ఎవరు?
అమెరికా నటుడు జాక్ నికోల్‌సన్,
యూకేకు చెందిన డేనియల్ డే లూయిస్ ఇద్దరూ చెరో 3 సార్లు ఈ అవార్డును గెలుపొందారు.
8 Interesting Facts about Oscar Awards in Telugu
Who won most number of Oscar awards?
Which movie got more number of Oscar awards?
Which actor got more number of Oscar awards?