స్పూర్తిదాయకమైన సూక్తులు – 5 Latest Telugu Inspiring Quotes
ఆగిపోవడం అనే ఆలోచనే లేని నీ ప్రయాణంలో
రాళ్లుంటే ఏంటి….
ముళ్ళుంటే ఏంటి..
నువ్వు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన
ఆ మనుషుల గర్వాన్ని పాతాళానికి తొక్కుకుంటూ పో.
ఏ అమ్మాయి అయితే
ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ,
తన కన్నీళ్లను తానే తుడుచుకుని,
తనకి తానే సమాధానం చెప్పుకుంటూ,
నిలబడాలని, బ్రతకాలని
గట్టిగా నిర్ణయం తీసుకుంటుందో
తనే ఓ నిజమైన యోధురాలు..!!

కత్తిరించడం వల్ల
పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్టు
విమర్శల వల్ల మనలో నూతన శక్తి బయటికొస్తుంది.
ప్రతి విమర్శ నుంచీ మనం ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సిందే.
ఒకరితో ఇంకొకరిని పోల్చకూడదు.
ఎందుకంటే..
కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు.
అలానే సింహం కూడా..
ఎప్పుడు కుక్కలా విశ్వాసం చూపలేదు.
ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్ళు.
మనకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి.
ఎదుటివాళ్లకు నచ్చేలా బతకాలంటే సర్దుకుపోవాలి.
అందరికీ నచ్చాలంటే నవ్వుతూ బ్రతకాలి.
మనకు నచ్చినట్టే బ్రతకాలి అనుకుంటూ..
అందరికి నచ్చేలా బ్రతికేస్తున్నాం.

Top 20 Telugu Quotes Text – టాప్ 20 కోట్స్
జీవితానికి ఉపయోగపడే టాప్ 35 కోట్స్ – బెస్ట్ లైఫ్ కోట్స్
టాప్ 50 రియాలిటీ కోట్స్ – Reality Quotes in Telugu