Menu Close

జాతీయ జెండా గురుంచి ఆసక్తికర విషియాలు – 13 Interesting Facts About Indian Flag in Telugu


  • భారత జాతీయ పతాకాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య డిజైన్ చేశారు.
  • భారతీయ పతాకాన్ని 1947 జులై 22న గుర్తించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15న దీన్ని ఎగరేశారు.
  • మొదటిసారి జాతీయ జెండాను 1906 ఆగస్టు 7న ఎగరేశారు. కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్ లో దీన్ని ఎగరేశారు. అయితే అందులో కేవలం మూడు అడ్డు గీతలు (ఆకుపచ్చ, పసుపు, ఎరుపు) మాత్రమే ఉండేవి.

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం
ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి👇

Telegram WhatsApp
  • చట్ట ప్రకారం భారత జాతీయ పతాకాన్ని ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేయాలి. కాటన్, సిల్క్ రెండూ కలిపిన ఈ వస్త్రాన్ని గాంధీజీ పాపులర్ చేశారు.
  • కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం (KKGSS) మాత్రమే జెండాకి సంబంధించిన క్లాత్ తయారుచేస్తుంది. ఈ సంస్థ మాత్రమే భారతీయ పతాకం తయారుచేయడానికి లైసెన్స్ పొందిన సంస్థ.

  • మన జెండాలోని కాషాయం రంగు శక్తి, పరాక్రమానికి చిహ్నం. తెలుపు స్వచ్ఛతకు, శాంతికి, సత్యానికి చిహ్నం. ఇక ఆకు పచ్చ రంగు ప్రజల శ్రేయస్సుకు చిహ్నం. అశోక చక్రం ధర్మానికి చిహ్నం.
  • జెండా మధ్యలో ఉన్న అశోక చక్రం నేవీ బ్లూ రంగులో ఉంటుంది. అందులో 24 చువ్వలు ఉంటాయి.
  • భీకాజీ రుస్తుం కామా విదేశాల్లో భారతీయ పతాకాన్ని ఎగరేసిన మొదటి వ్యక్తి.

  • టెన్సింగ్ నార్గే అనే వ్యక్తి ఎవరెస్ట్ పైన భారతీయ పతాకాన్ని ఎగరేసిన మొదటి వ్యక్తి. 1953 మే29న మన జాతీయ జెండాను నార్గే ఎవరెస్ట్‌పై ఎగరేశారు.
  • 2002 కంటే ముందు భారతీయ పౌరులు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో జెండా ఎగరేయడానికి వీలుండేది కాదు. కానీ 2002లో సుప్రీం కోర్టు ఫ్లాగ్ కోడ్‌ను మార్చింది. మిగిలిన రోజుల్లోనూ జెండా ఎగరేయవచ్చని పేర్కొంది.

  • ఫ్లాగ్ కోడ్ ప్రకారం జెండాను పగటి పూట మాత్రమే ఎగరేయాలి. జాతీయ జెండా పైన ఎలాంటి ఇతర జెండాలు ఉండకూడదు.
  • జెండాను తిరగేసి ఎగరేయడం, కింద పడుకోబెట్టడం వంటివి చేయకూడదు.
  • ఒకవేళ విదేశాల నుంచి ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వ కారులో ప్రయాణం చేస్తే భారత జెండా కుడి వైపు, ఆ దేశపు జాతీయ జెండా ఎడమ వైపు ఉంచాలి.

Interesting Facts About Indian Flag in Telugu

Like and Share
+1
1
+1
0
+1
0
Share with your friends & family
Posted in Educational Content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading