Menu Close

సంతృప్తిగా బ్రతకడానికి 12 రూల్స్ – 12 Rules for Life Book in Telugu


సంతృప్తిగా బ్రతకడానికి 12 రూల్స్ – 12 Rules for Life Book in Telugu

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన “12 Rules for Life” పుస్తకం ప్రముఖ కెనడియన్ క్లినికల్ సైకాలజిస్ట్ జోర్డాన్ బి. పీటర్సన్ రాశారు. 2018లో ప్రచురించబడిన ఈ పుస్తకం ఇప్పటివరకు దాదాపుగా 50 లక్షలకు పైగా అమ్ముడుపోయాయి.

జీవితం యుక్క అర్థాన్ని కనుగొని, సంతోషంగా మరియు సమర్థంగా జీవించడానికి కావాల్సిన “12 రూల్స్” గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. వ్యక్తిగత బాధ్యతను, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఆచరణాత్మక సూచనలు ఇందులో ఉన్నాయి.

సంతృప్తిగా బ్రతకడానికి 12 రూల్స్ - 12 Rules for Life Book in Telugu

12 Rules for Life Book Key Points in Telugu

1. నిటారుగా కాన్ఫిడెంట్ గా నిలబడు: ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా, గౌరవంగా నిలబడు దాని వల్ల ఇతరులకి నీ పై గౌరవం పెరుగుతుంది. నిన్ను చూసే విదానమే మారిపోతుంది.
2. అందరి కంటే ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి: ఇతరుల శ్రేయస్సు కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో, అంతకన్నా ఎక్కువ శ్రద్ధ నీ శారీరక, మానసిక ఆరోగ్యంపై చూపించాలి.
3. నీ మంచి కోరే వారితోనే స్నేహం చెయ్యి: నీ జీవితంలో సానుకూలతను, ప్రేరణను తీసుకురాగల వ్యక్తులతో మాత్రమే స్నేహాలను కొనసాగించు.
4. ఇతరులతో కాదు, నీతోనే నువ్వు పోటీ పడాలి: ఇతరుల విజయాలతో నీ విజయాలను పోల్చి నిరాశపడకుండా, నిన్నటి కంటే నేడు ఎలా మెరుగ్గా ఉన్నావో చూడాలి.

5. మీపై గౌరవం పెరిగేలా మీ పిల్లల్ని మీరు పెంచాలి: పిల్లల పెంపకంలో ప్రేమ, క్రమశిక్షణ సమతుల్యంగా పాటించి, వారిలో బాధ్యతా భావాన్ని కలిగించు.
6. మొదటిగా ఇంటిని చక్కదిద్దుకోవాలి: ఇతరులను విమర్శించే ముందు నీ వ్యక్తిగత జీవితాన్ని, బాధ్యతలను సరిదిద్దుకోవాలి.
7. సులువైనది కాదు, ఏది సరైనదో అదే చెయ్యాలి: కష్టమైన మార్గమే ఎక్కువగా విలువనిస్తుంది. అది నీకు సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తుంది.
8. నిజమే చెప్పు: కనీసం అబద్దం చెప్పకుండా వుండటానికి ప్రయత్నించు: నిజాయితీ వ్యక్తిత్వాన్ని, విశ్వసనీయతను పెంచుతుంది, జీవితంలో కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది.

9. ఇతరులు మాట్లాడేది శ్రద్దగా విను: ఇతరుల మాటలను శ్రద్ధగా విని, కొత్త విషయాలను నేర్చుకో.
10. మీరు మాట్లాడాలనుకున్నది స్పష్టంగా మాట్లాడండి: స్పష్టమైన మీ మాటలు అనవసరమైన అపార్థాలను నివారించి, జీవన మార్గాన్ని సరళతరం చేస్తుంది.
11. కొన్ని సార్లు పిల్లలు చేస్తున్న పనులని ఆపకూడదు: పిల్లలలో సాహస భావన, స్వతంత్ర నిర్ణయాలను ప్రోత్సహించడం ద్వారా వారు స్వయం సమర్థులుగా ఎదుగుతారు.
12. చిన్న చిన్న వాటిలో కూడా ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నించండి: జీవితంలో చిన్నచిన్న ఆనందాలను గుర్తించి, మనసును సంతోషంతో నింపుకోవాలి.

ఈ పుస్తకంలో వున్న రూల్స్ పాటించడం ద్వారా మనిషి మానసికంగా దృఢంగా మారి, జీవితంలోని సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని, ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ ఆనందంగా, సంతృప్తిగా జీవనం సాగించగలడు.

ప్రతి ఒక్కరూ తప్పకుండా
చదవాల్సిన పుస్తకం ఇది👇
12 Rules for Life

పుస్తకం గురించి కొంత సమాచారం:
పుస్తకం పేరు: 12 రూల్స్ ఫర్ లైఫ్ (12 Rules for Life)
రచయిత: జోర్డాన్ బి. పీటర్సన్ (Jordan B. Peterson)
ప్రచురణ సంవత్సరం: జనవరి, 2018
వర్గం: వ్యక్తిత్వ వికాసం, మానసిక శాస్త్రం, తత్వశాస్త్రం
పేజీల సంఖ్య: సుమారు 409 పేజీలు
అనువాదాలు: ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా భాషల్లో అనువదించబడింది
అమ్ముడైన కాపీలు: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలకు పైగా
ప్రచురణ సంస్థ: పెంగ్విన్ రాండమ్ హౌస్
ప్రధాన ఉద్దేశ్యం: వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ, బాధ్యత, స్పష్టతతో కూడిన అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆచరణీయ నియమాలను వివరిస్తుంది.

ఆనందంగా వుండాలనేదే ప్రతి ఒక్కరి కోరిక – The Art of Happiness Book in Telugu

Like and Share
+1
1
+1
0
+1
0
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading