అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
1.నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది.
2.చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది.
3.మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మసరుతాము…
4.ఐసులా కరిగిపోయే ఐశ్వర్కం కన్నా, మాటలా నిలిచిపోయే మంచితనమే గొప్పది.
5.కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.

6.మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు.
7.నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న.
8.మేలు చేయక పోయిన పరవాలేదు. ఎవరికి కీడు మాత్రం చేయకూడదు.

9.నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం.
10.సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది.
11.పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి.
12.ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు.

13.మనం పక్షుల్లా గాలిలో ఎగరడం, చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ భూమిపై మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియడం లేదు .
14.ఆకలి వేసినా సింహం గడ్డిమేయదు. కష్టాలెన్ని చుట్టు ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.
15.ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.

16.మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి, ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి ప్రతిభింభిస్తుంది. ప్రతి వారు దీపం కాకపోవచ్చు, కాని అద్దం కాగలరు. తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడమే జీవితం.
వ్యక్తిత్వ వికాస సూత్రాలు – Personality Development Lessons in Telugu