Menu Close

ఢిల్లీలో నౌరోజ్ కా మేళా


అక్బర్ ప్రతీ సంవత్సరం ఢిల్లీలో నౌరోజ్ కా మేళా ఏర్పాటు చేయిస్తుండే వాడు.. ఇందులో పురుషులకు ప్రవేశం ఉండేది కాదు, అక్బర్ ఈ జాతరకి ఆడవారిలా మారు వేషంలో వెళ్తుండే వాడు మరియు ఏ ఆడవారు అతన్ని మంత్ర ముగ్దన్ని చేయుదురో.. వారిని అతని దాసిలు నమ్మించి కుట్ర పూరితంగా అక్బర్ సమ్ముఖానికి తీసుకు పోయేవారు..

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now
women party old

ఒక రోజు ఈ నౌరోజ్ జాతరకు మహారాణా ప్రతాప్ సింహ్ చిన్న తమ్ముడు మహారాజు శక్తిసింహ్ బిడ్డ జాతర చూడటానికి వచ్చింది. ఆమె పేరు బాయిసా కిరణ్ దేవి. ఆమె వివాహం బీకానేర్ యొక్క మహారాజు పృథివీ రాజు గారితో అయ్యింది.

బాయిసా కిరణ్ దేవి సౌందర్యాన్ని చూసి అక్బర్ తనను తాను నియంత్రణ చేసుకోలేకపోవటం మరియు తనని ఎవరు ఏమిటి అని తెలుసు కోకుండానే, దాసీల ద్వారా మోసపూరితంగా రాణివాసం మహల్ లోనికి రప్పించు కున్నాడు.

అక్బర్ ఎప్పుడైతే బాయిసా కిరణ్ దేవిని స్పర్శిచటానికి ప్రయత్నించగానే కిరణ్ దేవి గారు నడుంలో దాచిపెట్టు కొచ్చిన ఖడ్గము తీసింది మరియు ఏకధాటిగా అక్బర్ ను కిందపడేసి అతని ఛాతిపైన కాలుతో తొక్కుతూ మెడమీద కత్తిపెట్టింది. మరియు గర్జిస్తూ అన్నది ఓరీ నీచుడా, నరాధముడా, నా గురించి సరిగ్గా ఎరుగ నట్లున్నావు, ఎవరి పేరు చెప్తే నీకు నిద్ర పట్టదో.. ఆ నేను మహారాణా ప్రతాప్ తమ్ముని బిడ్డను..

నీ చివరి కోరిక ఏమిటో చెప్పు, అక్బర్ ముఖం రంగు మారింది ముచ్చెమటలు పట్టాయి. ఎప్పుడూ ఊహించి ఉండక పోవచ్చు ఏమనంటే, ఈ విధంగా ఇలా ఒక నాడు అక్బర్ వంటివాడు నేడు ఒక రాకుమారి కిరణ్ దేవి బాయీసా గారి చరణాలల్లో ఉంటాడని అనుకొని ఉండడు.

అక్బర్ అన్నాడు:- మిమ్మల్ని గుర్తించ లేకపోయాను, నా ద్వారా తప్పు జరిగిపోయింది …. నన్ను క్షమించు దేవీ.

దీనితో కిరణ్ దేవి బాయిసా అన్నది:- ఇక మీదట ఢిల్లీలో ఈ నౌరోజ్ మేళా జరగొద్దు. అంతేగాక ఏ ఒక్క స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు. అక్బర్🤴🏻 చేతులు👏🏻 జోడించి వేడుకున్నాడు ఇక మీదట ఈ జాతర జరుగదు.

ఇక ఆ రోజు తర్వాత మళ్ళీ ఆ మేళా జరుగలేదు…. ఈ దృష్టాంత వర్ణనము
గిరిధర్ ఆసియ ద్వారా రచించిన సగథ రాంబో పుట 632వ పేజీలో ముద్రిత మయ్యింది.

బీకానేర్ సంగ్రహాలయంలో ఉన్న ఒక పేయింటింగ్ కూడా ఈ ఘటనను ఒక పద్యంలో చెప్ప నైనది.

కిరణ్ ఆడసింహం వలె పడగొట్టి తొక్కి మెడపై కత్తి దూయడం.. ఈ హఠాత్ పరిణామము వలన అక్బర్ కు🤲🏼 చేతులు చాచి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడాల్సి వచ్చింది….. అక్బర్ ఛాతి పైన కాలుపెట్టి నిలబడిన వీరబాలిక కిరణ్ దేవి చిత్రం ఈనాటికినీ జైపూర్ సంగ్రహాలయంలో సురక్షితంగా ఉంది.

Share with your friends & family
Posted in Telugu Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading