ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఏ జన్మలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటు తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలుపు తట్టింది ఏరి కోరి వెతికి
నీ అండ చూసింది నెత్తెక్కి కూర్చింది
నన్నెళ్లి పొమ్మంది సవితి
రవ్వంత నీ పక్క చోటివ్వనంటుంది
పోట్లాటకొస్తుంది దండెత్తి
ఆ సంగతేందో ఓ కాస్త నువ్వే తేల్చుకొరా పెనిమిటి
కోరమీసం పోలీసోడా నన్ను కొంచెం చేసుకోరా
గుండె మీది నక్షత్రాల నన్ను నీతో ఉండనీరా
ఏ జన్మలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటు తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలుపు తట్టింది ఏరి కోరి వెతికి
పనిలో పడితే నీకు ఏది గురుతురాదు
నువ్వలా వెళితే నాకేమో ఊసుపోదు
పలవరింత పులకరింత చెరొక సగముగా
సమయమంతా నీవే ఆక్రమించినావురా
ఏ గుళ్లో ఏ గంట వినిపించిన గాని
నిన్నేగా నే తలుచుకుంటా
మెల్లోన్ని సూత్రాన్ని ముప్పొద్దు తడిమేసి నీ క్షేమమే కోరుకుంటా
నా లోకమంతా సంతోషమంతా నీతో ఉన్నదంటా
కోరమీసం పోలీసోడా నన్ను కొంచెం చేసుకోరా
గుండె మీది నక్షత్రాల నన్ను నీతో ఉండనీరా
ఏ జన్మలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటు తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలుపు తట్టింది ఏరి కోరి వెతికి
Movie: Krack
Song: Korameesam polisoda
Lyrics: Ramjogayya sastry
Music: Thaman S
Singer: Ramya behra