ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Zebra Movie Review – జీబ్రా రివ్యూ – సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా వచ్చిన సినిమా జీబ్రా. కన్నడ స్టార్ డాలీ ధనంజయ, సత్యరాజ్ , కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాస్రూర్ వంటి పేర్లు ఉండటం తో సోషల్ మీడియా లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఇక డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ కి ఇదే మొదటి థియేట్రికల్ రిలీజ్, ముందు సినిమా పెంగ్విన్ ఒటిటి లో రిలీజ్ అయింది.
సత్య దేవ్ స్క్రిప్ట్ సెలక్షన్ ఎప్పడు పక్కాగా ఉంటుంది. ఈ సారి కూడా అది మిస్ అవ్వలేదు అని చెప్పొచ్చు.ముఖ్యంగా సినిమా ప్లాట్ కథ మొత్తాన్ని నడుపుతుంది. ఫస్ట్ హాఫ్ ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. సత్యదేవ్ , ధనంజయ పోటా పోటీ గా నటించి అదరగొట్టారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ కూడా సెకండ్ హాఫ్ పై ఉత్కంఠ ను పెంచుతుంది.
సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా కామెడీ, ఎమోషన్ బాగా పండాయి.ముఖ్యంగా సత్యదేవ్ ,సత్య , సునీల్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.ప్రీ క్లైమాక్స్ కూడా బాగా వర్కౌట్ అయింది.
సత్యరాజ్, ప్రియ భవానీ శంకర్ వారి పాత్రలకు న్యాయం చేశారు..కొత్త క్యారెక్టర్ లో సునీల్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ అని చెప్పొచ్చు . ఇక కమెడియన్ సత్య మళ్లీ అదరగొట్టాడు.
డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంది.రవి బాస్రూర్… డైరెక్టర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మరో సారి నిలబెట్టుకున్నాడు. ముఖ్యమైన సీన్స్ లో తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడు అని చెప్పాలి .ఎడిటింగ్ కూడా సినిమాని ఒక మెట్టు ఎక్కించింది.
ఈ ఇయర్ ఎండ్ కి ఒక మంచి ఫన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. 2024 లో వచ్చిన బెస్ట్ మూవీస్ సరసన జీబ్రా పక్కా నిలుస్తుందని అంటున్నారు నెటిజన్లు. సత్యదేవ్ కి ఒక మంచి కమర్షియల్ హిట్ వచ్చేసినట్టే అని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.
Zebra Movie Review – జీబ్రా రివ్యూ – సత్యదేవ్