ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Yeto Vellipoyindi Manasu Song Lyrics In Telugu – Ninne Pelladatha
ఎటో వెళ్ళిపోయింది మనసు…
ఎటో వెళ్ళిపోయింది మనసు… ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకి తీసీ… కబురియ్యలేవా ఏమయిందో… ఓ
ఎటో వెళ్ళిపోయింది మనసు… ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ… కబురియ్యలేవా..!!
ఏమయిందో ఏమయిందో… ఏమయిందో…!!!
ఏ స్నేహమూ… కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదూ
ఇచ్చేందుకే మనసుందని… నాకెవ్వరు చెప్పలేదూ…
చెలిమి చిరునామా…. తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో…ఓ
ఎటో వెళ్ళిపోయింది మనసు…ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ… కబురియ్యలేవా…!!
ఏమయిందో ఏమయిందో… ఏమయిందో… !!!
కలలన్నవి కొలువుండని… కనులుండి ఏం లాభమందీ
ఏ కదలికా కనిపించనీ… శిల లాంటి బ్రతుకెందుకందీ
తోడు ఒకరుంటే జీవితం ఎంతో… వేడుకవుతుంది అంటూ
ఎటో వెళ్ళిపోయింది మనసు… ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకి తీసీ… కబురియ్యలేవా ఏమయిందో…
అహా హా హా మనసు…ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ… కబురియ్యలేవా ఏమయిందో
ఏమయిందో… ఆ హా ఆహ… ఆ హా ఆహ