అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Yesutho Teeviganu Podamaa Lyrics In Telugu – Telugu Christian Songs
యేసుతో ఠీవిగాను పోదమా
అడ్డుగా వచ్చు వేరు గెల్వను
యుద్ధ నాదంబుతో పోదమా ||2||
రారాజు సైన్యమందు చేరను
ఆ రాజు దివ్య సేవ చేయను
యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా ||2||
యేసు ఠీవిగాను వెడలను
||యేసుతో ఠీవిగాను పోదమా||
విశ్వాస కవచమును ధరించుచు
ఆ రాజు నాజ్ఞమధిని నిలుచు
అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై ||2||
యేసుతో ఠీవిగాను పోదామా
||యేసుతో ఠీవిగాను పోదమా||
శోధనలు మనల చుట్టి వచ్చినా
సాతాను అంబులెన్నో తగిలినా
భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము ||2||
సాదనబెవరు నీవు నేనెగా
||యేసుతో ఠీవిగాను పోదమా||
ఓ యువతి యువకులార చేరుడి
శ్రీ యేసు రాజు వార్త చాటుడీ
లోకమంత ఏకమై యేసు రాజు గొల్వను ||2||
సాదనంబెవరు నీవు నేనెగా
||యేసుతో ఠీవిగాను పోదమా||
Yesutho Teeviganu Podamaa Lyrics In Telugu – Telugu Christian Songs