Menu Close

Yemaindho Teliyadu Naaku Song Lyrics In Telugu – MCA

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఏమైందో తెలియదు నాకు… ఏమైందో తెలియదు నాకు…
నీ పేరే పాటయ్యింది… పెదవులకు…

ఏమైందో తెలియదు నాకు… ఏమైందో తెలియదు నాకు…
నా పైనే కురిసే… ప్రతి వర్షం చినుకు…

ఈ మాయలో నిన్నిలా ముంచినందుకు…
నా పరిచయం వరమని పొగిడి చంపకు…

ఏమైందో తెలియదు నాకు… ఏమైందో తెలియదు నాకు…
నీ పేరే పాటయ్యింది… పెదవులకు…

ఏమైందో తెలియదు నాకు… ఏమైందో తెలియదు నాకు…
నా పైనే కురిసే… ప్రతి వర్షం చినుకు…

ఏ పువ్వుని చూస్తూ ఉన్నా… నీ నవ్వే కనిపిస్తోందే…
ఎవరైనా కోస్తుంటే… మరి గొడవైపోతుందే…
ఏ దారిన వెళుతూ ఉన్నా… నువ్వెదురొస్తున్నట్టుందే…
ఎవరైనా అడ్డొస్తే… తెగ తగువైపోతుందే…

విడి విడిగా మనమెక్కడ ఉన్నా… తప్పదుగా ఈ తంటా…
ఒక్కటిగా కలిసున్నామంటే… ఏ గొడవా రాదంట…

ఏమైందో తెలియదు నాకు… ఏమైందో తెలియదు నాకు…
నీ పేరే పాటయ్యింది… పెదవులకు…

నీకేమైందో తెలిసెను నాకు… ఏమైందో తెలిసెను నాకు…
కాస్తైనా చెప్పను… ఆ వివరం నీకు…

కనుపాపలు రెండున్నాయి… చిరు పెదవులు రెండున్నాయి
నా పక్కన ఉంటావా… నా రెండో మనసల్లే…

ఆ తారలు ఎన్నున్నాయి… నా ఊహలు అన్నున్నాయి
నా వెంటే వస్తావా… నిజమయ్యే కలలల్లే…

ఇప్పటి వరకు పాదం వేసిన… అడుగుల్నే చూశాను…
నడకే తెలియక ముందర నుంచే… నీ వైపే వస్తున్నాను…

ఏమైందో తెలియదు నాకు… ఏమైందో తెలియదు నాకు…
నీ పేరే పాటయ్యింది పెదవులకు…
నీకేమైందో తెలిసెను నాకు… ఏమైందో తెలిసెను నాకు…
నిన్నిట్టా చూస్తుంటే… బావుంది నాకు…

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading