ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Yehova Naa Balama Lyrics In Telugu – Telugu Christian Songs
యెహోవా నా బలమా
యధార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీమార్గం
నా శత్రువులు నను చుట్టినను
నరకపు పాశములరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన
విడువక నను ఎడబాయనిదేవా ||యెహోవా||
దయగల వారిపై దయచూపించును
కఠినుల యెడలను వికటము జూపును
గర్విష్టుల యొక్క గర్వమునణుచును
సర్వము నెరిగిన సర్వాధికారి ||యెహోవా||
మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
తన యాలయములో నా మొర వినెను
అదరెను ధరణి భయకంపముచే ||యెహోవా||
పౌరుషము గల ప్రభు కోపింపగ
పర్వతముల పునాదులు వణకెను
తన నోట నుండి వచ్చిన యగ్ని
దహించి వేసెను వైరులనెల్ల ||యెహోవా||
మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును
ఉరుములు మెరుపులు మెండుగజేసి
అపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా||
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగగ జేయును
జలరాసులనుండి బలమైన చేతితో
వెలుపల జేర్చిన బలమైన దేవుడు ||యెహోవా||
నా కాళ్ళను లేడి కాళ్ళగజేసి
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణ కేడెము నాకందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన ||యెహోవా||
యెహోవా జీవముగల దేవా
బహుగాస్థుతులకు అర్హుడవీవె
అన్య జనులలో ధన్యత జూపుచు
హల్లెలూయ స్తుతి గానము చేసెద
యెహోవా నా బలమా
యధార్థమైనది నీమార్గం
పరిపూర్ణమైనది నీమార్గం
Yehova Naa Balama Lyrics In Telugu – Telugu Christian Songs