Menu Close

Ye Kadha Yetu Parigeduthundo Song Lyrics In Telugu – Kerintha

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఏ కధ ఎటు పరుగెడుతుందో… ఏ అడుగెటు తడబడుతుందో
ఏ మలుపెటుగా నెడుతుందో… తెలీదే
ఏ క్షణమెపుడేం  చేస్తుందో… ఎవరినెలా నిలబెడుతుందో
ఎవరినెలా పడగొడుతుందో… తెలీదే

మెరిసే కలలు… తడిశాయి ఏందుకో
విరిసే లోపుగా…
ఎగసే అలలు… విరిగాయి దేనికో
తలవని తలపుగా…
స్వరంలో… ఆగిందే కేరింత
కన్నీరే ఓదార్పు… ఏంతో కొంత

చందమామ అందనిదని… తగని దిగులు చెందగలమా
వెన్నెలుంది చాలులెమ్మని… వెలుగు పడిని కలగ పయనించలేమా
బంధమెంత బలమైనా… బాధ లేని సమయాన
దాని విలువ తెలిసేనా… ఆ హా
చిగురు వగరు వివరాలు… సులువుగ తెలియని వయసులో
పగలు రేయి తేడాలు పోల్చని… మసకల మలుపులో
స్వరంలో… ఆగిందే కేరింత
కన్నీరే ఓదార్పు… ఏంతో కొంత

ముందుగానే తెలియదుగా… అసలు సిసలు బతుకు నడక
సమయము కదలదుగా… అపుడో ఇపుడో కలతె కనుపాపను అంటక
అనుభవాల ప్రతి పాఠం… జరిగినాకే కనుగొంటాం, సరేగాని అనుకుంటాం
ఎటుగా వెళితే ఏం దొరుకుతుందని… తెలుపని జీవితం
తనతోపాటు తలవంచి కదిలితే… పంచదా అమృతం
స్వరంలో… ఆగిందే కేరింత
కన్నీరే ఓదార్పు… ఏంతో కొంత

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading