Menu Close

Yamaha Nagari Song Lyrics In Telugu – Choodalani Vundi


Yamaha Nagari Song Lyrics In Telugu – Choodalani Vundi

సరిమామగరి సససనిదపసా
సరిమామగరి సససనిదపసా
రిమదానిదాప సాసనిదప మదపమరి

యమహా నగరి కలకత్తా పురి
యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
యమహా నగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి

నేతాజీ పుట్టిన చోట… గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే… ఆ నందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం… బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కదిలిపోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో

యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహా నగరి కలకత్తా పురి

బెంగాళి కోకిల బాల… తెలుగింటి కోడలు పిల్ల
మానిని సరోజిని
రోజంతా సూర్యుడి కింద… రాత్రంతా రజనీ గంధ సాగనీ
పదుగురు ప్రేమలే లేని లోకం.. దేవతా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కధలకు నెలవట కళలకు కొలువట
తిధులకు సెలవట అతిధుల గొడవట
కలకట నగరపు కిటకిటలో

యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహా నగరి కలకత్తా పురి

వందేమాతరమే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ… చౌరంగి రంగుల దునియా నీదిరా
విను గురు సత్యజిత్ రే సితార… ఎస్ డి బర్మన్ కీ ధారా
థెరిస్సా కి కుమారా… కదలి రారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో

యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
యమహా నగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి

Like and Share
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading