ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఈ గుడిలో సైన్స్‌కు కూడా అంతుచిక్కని రహస్యాలెన్నో – Yaganti Temple Mysteries
Yaganti Temple Mysteries: ఉమ్మడి కర్నూలు జిల్లా పవిత్ర శైవ క్షేత్రంలో యాగంటి ఉమామహేశ్వ స్వామి దేవస్థానంలో కార్తీకమాసం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒక్కటైనా యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఇప్పటికి సైన్స్ కూడా అంతుచిక్కని రహస్యాలెన్నో ఈ ఆలయానికే సొంతం.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటగా వెలసింది ఇక్కడే… స్వామి వారు వెలసిన ఆ గుహలో కాకులు దూరవు కంప్యూటర్ యుగంలో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చే టెక్నాలజీ కలిగిన సమయంలో కూడా నేటికీ శాస్త్రవేతలకు సైతం సవాలుగా మారిన క్షేత్రంలో నిజంగా భగవంతుడు లీలలు ఉన్నాయానడానికి ఉదాహరణగా నిలుస్తుంది.
బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చేపినట్లుగా యాగంటి క్షేత్రంలో వెలసిన బసవయ్యా అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేసెను అన్న మాట నిజంగానే జరుగుతుంది అనేదానికి నిదర్శనం ఆ క్షేత్రంలో ఉన్న నంది పెరుగుతూపోవడమే. ఇది అందరికి తెలిసిన నిజమే కానీ ఆ నంది ఎందుకు పెరుగుతుంది..?
ఆలా పెరగడానికి కారణమేంటి అనేది ఇప్పటివరకు కూడా ఎంతోమంది పరిశోదకులు ఎన్నో విధాలుగా పరిశోధనలు చేసిన అందుకు సరైన కారణం కనిపెట్టలేకపోయారు.
యాగంటి క్షేత్రంలో మరో ప్రేత్యేకత కలిగినది అక్కడున్న కోనేరు. ఆలయం ప్రాంగణంలో ముందుభాగంలో ఉండే కోనేరు కు ఒక ప్రత్యేకత ఉంది. నీళ్లు స్వచంగా కొబ్బరినీళ్ల వలే ఉంటాయి.ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఇప్పటికి ఎవ్వరికి అంతుచిక్కని రహస్యంగానే ఉంది.
యాగంటి క్షేత్రంలోని కోనేటిలో పుణ్యస్నానమ్మచారించి స్వామి వారిని దర్శించుకుంటే సకల దోషాలు పోతాయాని భక్తులు విశ్వాసిస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ముక్యంగా ఆ పరమేశ్వరుడుకి ప్రీతికరమైన మాసం కార్తీకమాసంలో స్వామివారిని పూజిస్తే ఎన్నో జన్మల పుణ్యపలితం ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.