Menu Close

మీ కోడలి సంపాదన ఎంత – Women Financial Status

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

మీ కోడలి సంపాదన ఎంత – Women Financial Status

టింగ్.. టాంగ్.. డోర్‌బెల్ మోగింది.
ఎవరో చూడమ్మా అన్నాడు సోఫాలో పడుకుని టీవీ చూస్తున్న మామగారు.
కోడలు కిచెన్ లోంచి వచ్చి తలుపు తీస్తుంది.
ఎవరో కొత్త వ్యక్తి, చేతిలో పెన్ను, పేపర్ పట్టుకుని నిలబడింది.
ఎవరు మీరు అని అడిగింది కోడలు?
మహిళల స్థితిగతులపై సర్వే జరుగుతోంది.
దానికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు వచ్చాను.
తలుపు దగ్గర నిలబడిన స్త్రీ సమాధానం చెప్పింది.

Business Ideas in Telugu

సరే అడగండి అని అంది కోడలు.
‘మీరు ఉద్యోగం చేస్తున్నారా? లేక గృహిణిగా వుంటున్నారా?’ అని అడిగినది మహిళ.
దానికి కోడలు,నేను ప్రస్తుతానికి గృహిణిగానే వున్నాను అంది.
ఇంతలో మామగారు బయటకు వచ్చాడు.
మహిళ: ‘సార్, నేను సర్వే చేయడానికి వచ్చాను.’
మామగారు: ‘హా.. విన్నాను మా కోడలు ఉద్యోగం చేస్తుంది’.
కోడలు: మామగారి వంక సందేహంగా చూడసాగింది.

మా కోడలు నన్ను, నా భార్యను బాగా చూసుకునే నర్సు.
మేము నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు
అన్నీ ఆమె చూసుకుంటుంది.

ఆమె బేబీ సిటర్ కూడా..
పిల్లలకి స్నానం చేయించడం, తినిపించడం,
బడికి పంపడం వంటివి ఆమె చూసుకుంటుంది.
ఏడుస్తున్న పిల్లవాడిని రాత్రిపూట
అతని తల్లి తట్టినప్పుడు మాత్రమే నిద్రపోతాడు.

నా కోడలు ట్యూటర్ కూడా..
పిల్లల చదువుల బాధ్యత కూడా ఆమె భుజస్కంధాలపైనే ఉంది.

Indian Traditional Women – Indian Traditional Women

ఇంటి నిర్వహణ అంతా ఆమె చేతుల్లోనే ఉంటుంది.
ఆమె బంధాలను కొనసాగించడంలో నిపుణురాలు.

ఆమె వల్లే నా కొడుకు ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులో
ప్రశాంతంగా పని చేయగలుగుతున్నాడు.
అంతేకాదు ఆమె నా కొడుకు సలహాదారు కూడా.

ఆమె మా ఇంటి ఇంజిన్.
లేని పక్షంలో మా ఇల్లె కాదు దేశమంతా స్తంభించిపోతుంది.

స్త్రీ: ‘అయితే , దీనివల్ల ఆదాయం లేదు కదా?’

కష్టపడి పనిచేసే నా కోడలు సంపాదన
మా ఇంట్లో ప్రశాంతత, చిరునవ్వు!
దీనికన్నా విలువైన సంపాదన ఏది లేదు!

ఆడది ఏమి చేసినా తప్పే..!
ఆనందమైన జీవితానికి ఆరు సూత్రాలు.

Like and Share
+1
2
+1
0
+1
1

Subscribe for latest updates

Loading