రక్షాబంధన్ ఎలా మొలైంది?
రాక్షసులతో యుద్ధానికి బయలుదేరిన దేవలోకాధిపతి ఇంద్రుడికి భార్య సచీదేవి రక్షణగా రాఖీ కట్టింది. అయితే ప్రస్తుతం ఇది భార్యభర్తల నుంచి వైదొలగి కేవలం సోదరి-సోదరుల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఉత్సవంగా మారిపోయింది. అలాగే యమధర్మరాజు సోదరి యుమన ప్రతి శ్రావణ పౌర్ణిమకు యుముడికి రాఖీ కట్టేది. తన సోదరితో ఎవరైతో రాఖీ కట్టించుకుంటారో వారికి అమరత్వం సిద్ధిస్తుందని యుముడు ప్రకటించాడు.
అప్పటి నుంచి మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి చిరాయువుగా జీవించాలని కోరుకుంటారు. అలాగే సోదరులు కూడా తమ సోదరికి అశీసులు అందించి ప్రేమను చాటుకుంటారు. వాస్తవానికి పసుపులో దారాన్ని ముంచి, దాన్ని మూడు పొరలుగా చేతికి కట్టిన రాఖీ రక్షణగా ఉంటుంది.
రాణి కర్ణావతి హుమయూన్‌కు రాఖీ పంపిన రోజు శ్రావణ పూర్ణిమ కావడంతో మేవార్‌లో రక్షా బంధన్ తొలిసారిగా ప్రారంభమై, తర్వాత రాజస్థాన్ అంతటా వ్యాపించింది. అక్కడ నుంచి దేశమంతటా జరుపుకుంటున్నారు. వేడుకల పరంగా రక్షాబంధన్ కాలంతోపాటు మారుతూ వస్తుంది. రాఖీని సోదరి తన సోదరుడు కుడిచేతికి కట్టాలి.
రాఖీ పండుగ విశిష్టత
రాఖీలో దారం బంధానికి చిహ్నం. అలాగే మంచి చెడులు, వైఫల్యాల నుంచి సోదరుని ఇది కాపాడుతుంది. ఎరుపు రంగు దారం అగ్నికి ప్రతీక… అంటే ఇది శక్తికి, రక్షణకు, భద్రతకు బలం.
ఒకొక్క చోట ఒక్కో పేరు – Different Names for Rakhi in Different States
ఒడిశాలో రాఖీ పండుగను ‘గ్రహ్మ పూర్ణిమ’ అని పిలుస్తారు. ఆ రోజున వారు దైవాల్లా భావించే ఆవులు, ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి, అలంకరిస్తారు. ‘పితా’ అని పిలిచే మిఠాయిలు చేసి ఇరుగుపొరుగుకి పంచుతారు.
మహారాష్ట్ర, గుజరాత్, గోవాలలో ఈ రోజును ‘నారియల్ పూర్ణిమ’ అంటారు. బాగా వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణుడు, సముద్రుణ్ని పూజిస్తారు. జాలరులు ఈ రోజు నుంచే చేపలు పట్టే కాలం ప్రారంభమైనట్టు భావిస్తారు.
ఉత్తరాఖండ్‌లోని ప్రజలు ‘జనోపున్యు’ పేరుతో రాఖీ పండుగను చేసుకుంటారు. తమ పవిత్రమైన జంధ్యాన్ని మారుస్తారు. చంపావత్ అనే జిల్లాలో బగ్వాల్ పేరుతో పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్, బీహార్‌లలో ‘కజరి పూర్ణిమ’ అని పిలుస్తారు. ఇది రైతులకి, కొడుకులున్న తల్లులకి చాలా ముఖ్యమైన పండగ.
గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల్లో ‘పవిత్రోపన’ పేరుతో పండుగను నిర్వహిస్తారు. ఈ రోజున శివుని గురించి ప్రజలందరూ పూజ చేస్తారు.
పురాణాలలో రాఖీ ప్రస్తావణ
మహాభారతంలో ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైనవారు కంగారుపడి గాయానికి మందుపూయడానికి తలో దిక్కున వెళ్లి వెదుకుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టింది.
దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కురు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడు.
రాక్షస రాజు బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది.
శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.
అలెగ్జాండర్ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. విశ్వవిజేతగా నిలవాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తివచ్చాడు. ఆ క్రమంలో బాక్ట్రియన్ యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు.
ఆ వివాహబంధం ద్వారా మధ్య ఆసియా ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు.
పురుషోత్తముడిపై దండెత్తిరావాలని అలెగ్జాండర్‌ను అంబి ఆహ్వానించాడు. దీంతో జీలం నది వడ్డున పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతాడు. పురుషోత్తముడి పరాక్రమాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సానా ఆయనను తన అన్నలా భావించి రాఖీ కడుతుంది.
యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓడిపోతే చంపవద్దని కోరుతుంది. దీంతో అలెగ్జాండర్‌ను చంపే అవకాశం చిక్కినా తన చేతికున్న రాఖీచూసి పురుషోత్తముడు విరమించుకున్నాడు.
Why We Celebrate Raksha Bandhan in Telugu?
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.