అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
What is The Reason for Matted Hair?

స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు,
జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు?
ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుట్టుని వదలివేయటం ఎక్కువ అయింది కానీ
ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు.
ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు.

- రెండు జడలు వేసుకోవడం:
రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా “చిన్నపిల్ల” అని, “పెళ్లికాలేదని” అర్ధం. అంటే ఆ అమ్మాయిలో “జీవ + ఈశ్వర” సంబంధం విడివిడిగా ఉందని అర్ధము. - ఒక జడ వేసుకోవడం:
పెళ్లి అయ్యిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు.
అంటే ఆమె తన జీవేశ్వరుడినిచేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం. - ముడి పెట్టుకోవడం:
జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానంకూడా ఉందని,
అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం.
అయితే ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా
జుట్టుని మూడు పాయలుగా విడతీసి త్రివేణీసంగమంలాగ కలుపుతూ అల్లేవారు.
ఈ మూడు పాయలకు అర్ధాలు ఏమిటి అంటే!!

తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం.
సత్వ, రజ, తమో గుణాలు,
జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అని అర్ధములు.

అమ్మాయిలు వేసుకున్న జడనిబట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది.
ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి.
పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడుచేసుకుంటున్నాం.
జుట్టు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం.

స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు, జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు?
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com