ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
What is Rave Party in Telugu – అసలు రేవ్ పార్టీ అంటే ఏంటీ
What is Rave Party in Telugu – అసలు రేవ్ పార్టీ అంటే ఏంటీ.. లోపల ఏం చేస్తారు.. పోలీసులు ఎందుకు రైడ్స్ చేస్తారు.. అందులో పాల్గొన్న వాళ్లు ముఖాలు కూడా కనిపించకుండా ఎందుకు ముసుగులేసుకుని వెళ్తుంటారో తెలుసుకోవాలని ఉత్సుకత సామాన్యుల్లో నెలకొంది.
ఇండియాలో పాశ్చాత్య సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే.. పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకుతోంది. సెలెబ్రిటీలు, డబ్బున్న బడాబాబులు.. అక్కడే చదువుకోవటమో, లేదా తీరిక సమయాల్లో అక్కడికి వెళ్లి తనివితీరా ఎంజాయ్ చేసి వస్తుండటమో జరుగుతోంది.
ఇలా అక్కడున్న కొన్ని కల్చర్ల రుచికి అలవాటు పడిన సెలెబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు.. అదే ‘ట్రెండ్’ను ఇక్కడ కూడా కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే ఈ రేవ్ పార్టీ.
రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950లో ఇంగ్లండ్‌లో మొదలై.. మెల్లిగా ప్రపంచమంతా వ్యాపించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో.. క్లోజ్డ్ ఏరియాలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకోనో, లేదా లైవ్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వటమే.. దానికి మైమరిచిపోతూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయటం ఉండేది.
ఇక.. పాశ్చత్య దేశాల్లో సాధారణంగానే మద్యం సేవించే అలవాటు ఉండటంతో.. అది కూడా కంటిన్యూ అయ్యేది. కాగా.. రాను రానూ ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తోంది. వైల్డ్ బిహేవియర్‌తో చేసుకునే పార్టీలకు రేవ్ పార్టీలు అని పిలవడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా ఈ రేవ్ పార్టీ కల్చర్.. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికవ్వటం ప్రారంభమైంది.
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న మేరకు.. రేవ్ పార్టీలు చాలా గోప్యంగా సాగుతున్నాయి. దానికి కారణం.. ఈ పార్టీల్లో సెలెబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు మాత్రమే పాల్గొనటం ఒక ఎత్తయితే.. ఈ పార్టీల్లో మద్యంతో పాటు డ్రగ్స్, అమ్మాయిలు ఇలా.. చాలానే యవ్వారం జరుగుతుందని టాక్.
ముఖ్యంగా యువత ఈ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ.. అశ్లీల నృత్యాలు చేయటం.. అదీ హద్దు మీరి శృంగార కార్యకలాపాలు జరుగుతాయని.. అన్నింటికీ అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్లే ఈ పార్టీల్లో పాల్గొంటారని సమాచారం.
సాధారణంగానే రేవ్ పార్టీలంటే చాలా ఖరీదైన వ్యవహారం. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజే సుమారు 50 లక్షలట. ఇంత ఖర్చు చేసి నిర్వహించే రేవ్ పార్టీలను చాలా గోప్యంగా నిర్వహిస్తారు. ఈ పార్టీలో ఎంపిక చేసిన వ్యక్తులే, అది కూడా పరిమిత సంఖ్యలోనే పాల్గొనేలా ప్లాన్ చేస్తారు. తెలియని వ్యక్తులను అస్సలు అనుమతించారు.
ముందుగానే ఈ పార్టీలో ఉండే కార్యక్రమాల గురించి చెప్పటంతో పాటు.. పాల్గొనే వాళ్ల రిక్వైర్‌మెంట్లను కూడా పరిగణలోకి తీసుకుని పార్టీని ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. అన్నింటికీ ఓకే అన్న వాళ్లే ఇందులో పాల్గొంటారని.. ఇందులో పాల్గొన్నారంటేనే దేనికైనా సిద్ధం (మద్యం, డ్రగ్స్, విచ్చలవిడి శృంగారం) అన్నట్టుగా సమాచారం.
ఇక ఈ రేవ్ పార్టీని బడాబాబుల ఫామ్ హౌసులోనో, గెస్ట్ హౌసుల్లోనో ఈ పార్టీని నిర్వహిస్తుంటారు. 24 గంటల నుంచి 3 రోజుల వరకు నిర్వహిస్తారని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఫుడ్, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లతో పాటు రకరకాల డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తారట. ఇక.. కొన్ని రేవ్ పార్టీల్లో అయితే.. ప్రత్యేకంగా లైంగిక కార్యకలాపాలు కూడా మెనూలో ఉంటాయని తెలుస్తోంది.
శృంగార కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేస్తారంటా. అందులోనూ.. రకరకాల ఫాంటసీ కార్యక్రమాలు.. రాయలేని విధంగా ఉంటాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ పార్టీలు నిర్వహించే దగ్గర.. సీసీ కెమెరాలు ఆఫ్‌లోనే ఉంటాయి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ముందే తీసుకుంటారని చెప్తున్నారు.
మన దేశంలో ఈ రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లోకి పాకింది. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ ఈ కల్చర్ పెరిగిపోతోంది.
సాధారణంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీలు చేసుకోవటం వరకు ఓకే.. కానీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకోవటం, మద్యంతో పాటు డ్రగ్స్ విచ్చలవిడిగా సేవించటం, అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తుండటం వల్ల ఇలాంటి పార్టీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
సాధారణంగానే.. అనుమతి లేకుండా పార్టీలు చేసుకోవడాన్ని పోలీసులు అంగీకరించరు. ఇక రేవ్ పార్టీలంటే కఠినంగా వ్యవహరిస్తుంటారు. పార్టీలపై రైడ్స్ చేసి.. అందులో డ్రగ్స్ వినియోగం ఏమైనా జరిగిందా లేదా అన్నది చూస్తారు. మైనర్లు ఎవరైనా పాల్గొన్నారా అన్నది కూడా ఆరా తీస్తారు.
ఇక అశ్లీలత ఏమైనా ఉందా అనేది కూడా గమనిస్తారు. పార్టీలో పాల్గొన్న వాళ్లందరి నుంచి బ్లెడ్, హెయిర్ శాంపిల్స్ తీసుకుని.. టెస్టులకు పంపిస్తారు. కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి రప్పించి.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. డ్రగ్స్ వాడినట్టు తేలితే.. వాళ్లను అదుపులోకి తీసుకుని మిగతా ప్రొసీడింగ్స్ చూస్తారు.
రేవ్ పార్టీ అంటే ఏమిటి?
జవాబు: రేవ్ పార్టీ అంటే సాధారణంగా రాత్రి సమయంలో జరుగుతుండే, ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్, లైటింగ్ ఎఫెక్ట్స్, మరియు డీజే మ్యూజిక్‌తో కూడిన పార్టీ.
రేవ్ పార్టీల్లో ఏలాంటి సంగీతం ప్లే చేస్తారు?
జవాబు: రేవ్ పార్టీల్లో ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ (EDM), హౌస్, టెక్నో, ట్రాన్స్ వంటి రకాల సంగీతం ప్లే చేస్తారు.
రేవ్ పార్టీలకు హాజరయ్యే వయస్సు ఏమిటి?
జవాబు: సాధారణంగా రేవ్ పార్టీలకు హాజరయ్యే వయస్సు 18 ఏళ్ళకు పైబడి ఉండాలి, కానీ కొన్నిసార్లు 21 ఏళ్ళు కూడా కావచ్చు.
రేవ్ పార్టీలలో భద్రత ఎలా ఉంటుంది?
జవాబు: రేవ్ పార్టీలలో భద్రత కోసం నిర్వాహకులు, సెక్యూరిటీ సిబ్బంది, మరియు ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాలు ఉంటాయి. అయినప్పటికీ, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
రేవ్ పార్టీలలో డ్రగ్స్ వాడకం ఉంటుందా?
జవాబు: కొన్నిసార్లు రేవ్ పార్టీలలో డ్రగ్స్ వాడకం ఉండవచ్చు. ఇది చట్టవిరుద్ధం మరియు ఆరోగ్యానికి హానికరం. సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా ఉండడం ముఖ్యం.
రేవ్ పార్టీలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి?
జవాబు: కంఫర్టబుల్ డ్రెస్, స్నీకర్స్, మరియు నీళ్ళ బాటిల్స్ తెచ్చుకోవాలి. పార్టీ స్థలానికి ఎలా చేరుకోవాలో ముందే తెలుసుకోవడం కూడా మంచిది.
రేవ్ పార్టీలలో ఏమి చేయవద్దు?
జవాబు: చట్టవిరుద్ధమైన డ్రగ్స్ వాడటం, ఇతరులకు అసౌకర్యం కలిగించడం, మరియు నిర్వాహకుల ఆదేశాలను పాటించకపోవడం చేయవద్దు.
What is a rave party?
A rave party is an event typically characterized by electronic dance music (EDM), colorful light displays, and a vibrant atmosphere. It often takes place in large venues like warehouses, clubs, or outdoor spaces.
Are rave parties legal?
The legality of rave parties depends on various factors such as location, permits, and adherence to local laws. In many places, organizers must obtain permits and adhere to safety regulations to host a rave legally.
What should I wear to a rave party?
Rave attire often includes bright and flashy clothing, such as neon colors, glow sticks, and costumes. Comfortable shoes are essential for dancing.
Is drug use common at rave parties?
Drug use has been associated with rave culture in the past, particularly substances like MDMA (ecstasy) and LSD. However, not all attendees use drugs, and many events enforce strict no-drug policies.
Are rave parties safe?
Safety at rave parties depends on various factors, including venue security, crowd control measures, and attendee behavior. Responsible organizers prioritize safety by providing medical assistance, security personnel, and harm reduction resources.
Can anyone attend a rave party?
Most rave parties are open to anyone who purchases a ticket, though some events may have age restrictions or require attendees to adhere to a dress code.
What music genres are played at rave parties?
Rave parties primarily feature electronic dance music (EDM), including subgenres like techno, house, trance, and dubstep. The music is often played by DJs or live performers.
How can I find rave parties near me?
Rave parties are often advertised through social media, event websites, and local EDM communities. Additionally, electronic music festivals frequently feature rave-style events.
What should I expect at my first rave party?
Expect a lively atmosphere with pulsating music, colorful lights, and energetic dancing. Be prepared for large crowds, and consider bringing essentials like water, earplugs, and cash.
How can I stay safe at a rave party?
To stay safe at a rave party, it’s essential to stay hydrated, pace yourself while dancing, and look out for friends. Avoid accepting drinks from strangers and be aware of your surroundings. If you feel unwell or uncomfortable, seek help from event staff or medical personnel.
What is Rave Party in Telugu – అసలు రేవ్ పార్టీ అంటే ఏంటీ