అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Vinukondi Kondadorala Lyrics in Telugu – Patnam Vachina Pativrathalu
పల్లవి:
హేయ్… హేయ్… హేయ్… హేయ్
ఇనుకోండి కొండ దొరల దండోరా
బంగారు చిలకలు రెండూ చూశారా
హేయ్… పిలకంత జడ ఉంది… నలకంత నడుముంది
పిసరంత పొగరుంది… సిసలైన సొగసుంది
బస్తీ గిస్తీ గస్తీ కాసి వెతకండోయ్…
ఇనుకోండి కొండ దొరల దండోరా
బంగారు చిలకలు రెండూ చూశారా
పిలకంత జడ ఉంది… నలకంత నడుముంది
పిసరంత పొగరుంది… సిసలైన సొగసుంది
బస్తీ గిస్తీ గస్తీ కాసి వెతకండోయ్…
చరణం: 1
ఇంగ్లీషులో ఢంగు చేస్తాదో దొరసాని
నాటు మాటలో ఘాటుకుంటదో దొరసాని..
ఆ.. ఆ.. ఇంగ్లీషులో డంగు చేస్తాదో దొరసాని
నాటు మాటలో ఘాటుకుంటదో దొరసాని..
కాశులపేరుందంది.. కంచిపట్టు చీరంది
రైళ్లుల్లో బసుల్లో కనపడితే చెప్పండి
ఒళ్లు కళ్లు ఒక్కటి చేసుకొని వెతకండోయ్…
ఇనుకోండి కొండ దొరల దండోరా
బంగారు చిలకలు రెండూ చూశారా
పిలకంత జడ ఉంది… నలకంత నడుముంది
పిసరంత పొగరుంది… సిసలైన సొగసుంది
బస్తీ గిస్తీ గస్తీ కాసి వెతకండోయ్…
చరణం: 2
పట్టణాలకే పుట్టుమచ్చ ఓ చిలకమ్మా
పల్లెసీమకే పచ్చబొట్టు ఓ చిలకమ్మా
ఆ.. ఆ.. పట్టణాలకే పుట్టుమచ్చ ఓ చిలకమ్మా
పల్లెసీమకే పచ్చబొట్టు ఓ చిలకమ్మా
హేయ్.. సినిమాలే చూస్తోందో? షికారులే చేస్తోందో?
బజారుకే వచ్చిందో? ఏ బాధలు పడుతోందో?
నింగికి నేలకు నిచ్చెనలేసుకొని వెతకండోయ్…
ఇనుకోండి కొండ దొరల దండోరా
బంగారు చిలకలు రెండూ చూశారా
పిలకంత జడ ఉంది… నలకంత నడుముంది
పిసరంత పొగరుంది… సిసలైన సొగసుంది
బస్తీ గిస్తీ గస్తీ కాసి వెతకండోయ్…