Menu Close

Vinnanule Priya Lyrics In Telugu – Bandipotu Dongalu

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Vinnanule Priya Lyrics In Telugu – Bandipotu Dongalu

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
విన్నానులే ప్రియా…  కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ… కొసరి విన్నానులే, ఏ ఏ
విన్నానులే ప్రియా

ఎదను దాచిన మౌనవీణ… కదలి మ్రోగెనులే, ఏఏ ఏ ఏ
ఎదను దాచిన మౌనవీణ… కదలి మ్రోగెనులే
ఆ మధుర రాగాలలో… నీవే ఒదిగి ఉన్నావులే, ఏఏ ఏ
ఒదిగి ఉన్నావులే

విన్నానులే ప్రియా… కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ… కొసరి విన్నానులే, ఏఏ ఏ
విన్నానులే ప్రియా

వికసించి వెలిగే నీ అందము
ఒక వేయి రేకుల అరవిందము
వికసించి వెలిగే నీ అందము
ఒక వేయి రేకుల అరవిందము
కలకల నవ్వే నీ కళ్ళు… కాముడు దాగిన పొదరిళ్ళు
(ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ)
ఆ నీల నయనాలలో నీవే నిండి ఉన్నావులే, ఏఏ ఏ
నిండి ఉన్నావులే

విన్నానులే ప్రియా…  కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ… కొసరి విన్నానులే, ఏఏ ఏ
విన్నానులే ప్రియా

చిరుగాలి వీచెను వింజామర… గగనాలు వేసెను విరి ఊయల
ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
చిరుగాలి వీచెను వింజామర… గగనాలు వేసెను విరి ఊయల
పల్లకి పంపెను తారకలు… పందిరి వేసెను చంద్రికలు
(ఆ ఆఆ ఆ ఆఆ)
ఆ, పసిడి పందిళ్ళలో మనకి పరిణయమౌనులే, పరిణయమౌనులే

విన్నానులే ప్రియా… కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ… కొసరి విన్నానులే, ఏఏ ఏ
విన్నానులే ప్రియా… ఆ ఆఆ ఆ

Like and Share
+1
1
+1
1
+1
0

Subscribe for latest updates

Loading