ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Vinakapothivi Kadara Lyrics in Telugu – ChowRaasta
ఇనకా పోతివి కదరా… ఇనకా పోతివి కదరా…
ఎరుక గలిగిన పదము… కొరివి కొని తెచ్చుకొని వనికితేమి ఫలము
దయ్యమోలే నిన్ను పట్టుకున్నది ధనము…
యుగములు గడిసినా… మారలేదు నీ గుణము…
నాకేదురే లేదని… నాకేదురే లేదని
నాకేదురే లేదని ఎగిసిపడే నీ మదము… భరియింపక
పుడమి శపియించెను… ఇది నిజం…
ఇనకా పోతివి కదరా… ఆ ఆ.. ఇనకా పోతివి కదరా… ఆ ఆ
ఏ… ఇనకా పోతివి కదరా… ఇనకా పోతివి కదరా…
దూరాన గల సిరులా దారులను గాలించి…
పడవాలిమానాల పయనించి, అవి తుంచి
కొమ్మ కుంకుమ పూల అడవి సుగంధాల…
పాదులను చిదిమి నరికి… పారించితివి మురికి…
ఆ పాపమో మున్ను… అంటుకునే విష కన్ను…
ఆ పాపమో మున్ను… అంటుకునే విష కన్ను…
ఏమౌనో నీ కథ… ఎందాకో ఈ వ్యథ…
ఇనకా పోతివి కదరా… ఆ ఆ.. ఇనకా పోతివి కదరా… ఆ ఆ
ఏ… ఇనకా పోతివి కదరా… ఇనకా పోతివి కదరా…
నేల యద చనుబాల దారలు ఈ నదుల…
కీచకుడై నువ్వు… కాటూ వెయ్యలేద…
చెట్టుకింతా జాగ… పిట్టా కింత గూడు…
పురుగు బూసికి పుట్ట… బొరియలుంటే చాలు…
నరుడా నీవెమో వందల ఎకరాలే పొంది…
చీమైనా రాకుండా గోడలు కట్టించినావు…
ఏడడుగుల జాగ… ఏడడుగుల జాగ చివరికి నీ గూడన్న
బైరాగి బోదను పెడ చెవిన పెడితివన్నా…
ఇనకా పోతివి కదరా… ఆ ఆ… ఇనకా పోతివి కదరా… ఆ ఆ
ఓ ఓ… ఇనకా పోతివి కదరా… ఇనకా పోతివి కదరా…
సలువా రాతి మేడ కట్టుకుని మురిసితివి…
కడు పేదలను ఎంచి మెట్ల కాడ నిలిపితివి…
రంగు తెగ మత కుల భేదాలనెంచితివి…
ఇలలో ఉత్తముడనని తెగ విర్రవీగితివి…
తొమ్మిదర్రల తొర్ర…ఆ ఆ… తొమ్మిదర్రల తొర్ర
గాలి తుంగ బుర్ర… తొమ్మిదర్రలా తొర్ర,, తొమ్మిదర్రలా తొర్ర
గాలి తుంగ బుర్ర…
కొరడ క్రిమి వేటుకు… ఒరిగెను నీ వెనుగర్ర…
ఇనకా పోతివి కదరా… ఆ ఆ.. ఇనకా పోతివి కదరా… ఆ ఆ
ఏ… ఇనకా పోతివి కదరా… ఇనకా పోతివి కదరా…
తేనేలొలికే పండ్లు… ఆకు సాటుననుండు…
వాడి గలిగిన ముండ్లు… పైనే ఉరుముచునుండు..
స్వాతి ముత్యపు చెమట… ఒల్లు ముత్యపు జల్లు…
భరణి ఉరుములు డొల్లు… కాపు కంకుల పొల్లు…
ఆశలేని మనిషికి… అడివే తన ఇల్లు…
ఆశలేని మనిషికి.. అడివే తన ఇల్లు…
సిరి మరిగిన నీకేమో… నెత్తి కెక్కినాయి కళ్లు…
ఇనకా పోతివి కదరా… ఇనకా పోతివి కదరా…
ఎరుక గలిగిన పదము… కొరివి కొని తెచ్చుకొని వనికితేమి ఫలము
ఎగువా తిరుమల… దిగువా తిరుమల…
నీలోనే కొలువుండే… నిలకడతో నీవుండు…
కనుపాపలో మక్కా అజ్మీరులున్నవీ…
జమయాత్ లేందుకు జపములు చాలు…
ఏ… ఘాటి ఎద్దువోలే… మతిని గుంజి కట్టు… ఓ ఓ ఓహ్ఓ
ఘాటి ఎద్దువోలే… మతిని గుంజి కట్టు…
కాసే పున్నమి కాంతి… నీలోపలనే పుట్టు…
ఇనకా పోతివి కదరా… ఆ ఆ.. ఇనకా పోతివి కదరా… ఆ ఆ
ఏ… ఇనకా పోతివి కదరా… ఇనకా పోతివి కదరా…