Menu Close

Veera Bobbili Kotalo Lyrics in Telugu – Donga Donga


Veera Bobbili Kotalo Lyrics in Telugu – Donga Donga

వీర బొబ్బులి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
ఊరే నిద్దురపోయే యేళ
సద్దే మనిగిన రాతిరి యేల
అందెల సడి నా మనసే దోసింది..

వీర బొబ్బులి కోటలో
మాటు మనిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది..


వీర బొబ్బులి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది..

వీర బొబ్బులి కోటలో
యెన్నెల కాసే యేలల్లో
పడుసున మనసుకి గాలాలేసే
నంగనాచి దొంగలే
అందెలసడి నీ మనసును దొసిందా

వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి
వజ్రాల అందెలు వేస్తా వగలాడి కాళ్ళకి
మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి
ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి

మీ ఆశలన్నీ
అడిఆశలంట
ఈ ఏలం పాట
మీ ఊహల పంట

నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా

ఇద్దరు సూరిలొచ్చరమ్మా
ఒంటరి తామర నలిగేనమ్మా
కత్తుల బోని సోయం వరమే
కలిగెను నాలో ఒక భయమే

ధమయంతి ని నేనమ్మా
నల మహారాజు ఎవరమ్మా

మనసైన వాణ్ణి నేనమ్మా
మహరాజును నేనే చిలకమ్మా

ఇది పరవశం నాకు
నా తనువున ఒణుకు
వెలువడదే పలుకు
తను ఎవరికి సొంతమో చెప్పలంటే
ఏం చెబుతుంది మూగప్రాయం

నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now
Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading