ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Vayyari Godaramma Lyrics In Telugu – Preminchu Pelladu
వయ్యారి గోదారమ్మ… ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో… కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై
వయ్యారి గోదారమ్మ… ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
లల్లాల లాల లల్లాల లాల… లల్లాల లాల లల్లాల లాల
లాలాలాలల లాలాలా లా
నిజము నా స్వప్నం… అహా, కలనో
ఓహో లేనో, ఓహో హో
నీవు నా సత్యం… ఓహో అవునో
ఓహో కానో ఓహో హో
ఊహ నీవే ఆ హాహా హా… ఉసురుకారాదా, ఆ హా
మోహమల్లె… ఆ హా హాహా, ముసురుకోరాదా, ఆ హా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ… మువ్వగోపాలుని రాధికా
ఆకాశవీణ గీతాలలోన… ఆలాపనై నే కరిగిపోనా
వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
తందాన తాన నానా… తందాన తాన నానా న
తందాన తాన నానా… తందాన తాన నానా
తాకితే తాపం… ఓహో, కమలం
ఓహో, భ్రమరం… ఓహో హో
సోకితే మైకం… ఓహో, అధరం
ఓహో, అధరం… ఓహో హో
ఆటవెలది, ఆ హాహా హా… ఆడుతూరావే, హా హా
తేటగీతి, ఆహా హా హా… తేలిపోనీవే, హా హా
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని… యవ్వనాలకు కానుక
చుంబించుకున్న బింభాధరాల… సూర్యోదయాలే పండేటి వేళ
వయ్యారి గోదారమ్మ… ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో… కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై
వయ్యారి గోదారమ్మ… ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం