Menu Close

Varshinche Meghamla Nenunna Lyrics in Telugu-Cheli

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

వర్షించే మేఘంలా నేనున్నా… నీ ప్రేమే నాకొద్దని అన్నా
వర్షించే మేఘంలా నేనున్నా… నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట… ఏనాడూ రానంట నీవెంట
నా గతమంతా… నే మరిచానే, నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించెయ్ కే… భామా భామా, ప్రేమా గీమా వలదే

వర్షించే మేఘంలా నేనున్నా… నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట… ఏనాడూ రానంట నీవెంట
నా గతమంతా… నే మరిచానే, నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించెయ్ కే… భామా భామా, ప్రేమా గీమా వలదే

నాటి వెన్నెల… మళ్ళీ రానే రాదు
మనసులో వ్యధ… ఇంక అణగదు
వలపుదేవిని మరువగ తరమా… ఆఆ ఆమని ఎరుగని శూన్యవనమిది
నీవే నేనని నువ్వు పలుకగ… కోటి పువ్వులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే… వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే… మరచిపోవే మనసా, ఆఆ

ఓ ఓ… వర్షించే మేఘంలా నేనున్నా… నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట… ఏనాడూ రానంట నీవెంట
నా గతమంతా… నే మరిచానే, నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించెయ్ కే… భామా భామా, ప్రేమా గీమా వలదే

చేరుకోమని చెలి పిలువగ… ఆశతో మది ఒక కల గని
నూరుజన్మల వరమై… నిలిచే ఓ చెలీ
ఒంటరి ఈ భ్రమ కల చెదిరిన ఉండునా… ప్రేమ అని తెలిసిన
సర్వనాడులు కృంగవా చెలియా…
ఒక నిమిషమైన నిను తలువకనే… బ్రతికేది లేదు అని తెలుపుటెలా
మది మరిచిపోని మధురోహలనే… మరిచిపోవే మనసా

లిల్లాయిల్లాయి ల్లాయిల్లాయిల్లా లే… లిల్లాయిల్లాయి ల్లాయిల్లాయిల్లా
లిల్లాయిల్లాయి ల్లాయిల్లాయిల్లా లే… లిల్లాయిల్లాయి ల్లాయిల్లాయిల్లా

Like and Share
+1
3
+1
8
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading