ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Vaalu Kannuladaana Lyrics in Telugu
వాలు కనులదానా…
వాలు కనులదానా… నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోన… నీ రూపు చూసి శిలను అయితినే ఓ ఓ
ఒక మాటరాక మూగబోతినే… ఒక మాటరాక మూగబోతినే
వాలు కనులదాన… నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోనా…
నీ రూపుచూసి శిలను అయితినే ఓ ఓ…
ఒక మాటరాక…
ఒక మాటరాక మూగబోతినే… ఒక మాటరాక మూగబోతినే
చెలియా నిన్నే తలచీ… కనులా జడిలో తడిచీ
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది
నీ ధ్యాసే అయ్యింది…
తలపు మరిగి రేయి పెరిగి ఓళ్లంతా పొంగింది
ఆహారం వద్దంది…
క్షణక్షణ మీ తలపుతో… తనువు చిక్కిపోయేలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా… నీకుసాటి ఏది ప్రియతమా..!
మీటితే లోకాలు పలుక… ఎల్లోరా శిల్పాలు ఉలక
అజంతా సిగ్గులు ఒలక చిలకా… ఆ ఆ
మీటితే లోకాలు పలుక… ఎల్లోరా శిల్పాలు ఉలక
అజంతా సిగ్గులు ఒలికే రోజే… నిను నేను చేరుకోనా
వాలు కనులదానా… నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోన… నీ రూపు చూసి శిలను అయితినే, ఓ ఓ
ఒక మాటరాక… ఒక మాటరాక మూగబోతినే
దైవం నిన్నే మలచీ… తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు…
నీ సొంతమయ్యింది నాకట్ట నిల్చింది…
గడియ గడియ ఒడిని కరుగు
రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడివడిగా చేరుకో… కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది… నిండు ప్రాణమివ్వమన్నదీ
జక్కన్న కాలంనాటి… చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగ వచ్చిందట చెలియా..!!
జక్కన్న కాలంనాటి… చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగ వచ్చిందట చెలియా… నీ సొగసు కేదిసాటి
వాలు కనులదానా… నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోన… నీ రూపు చూసి శిలను అయితినే, ఓ ఓ
మాటరాక… ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే… ఒక మాటరాక మూగబోతినే
Vaalu Kannuladaana Lyrics in Telugu