Menu Close

Urumulu Nee Navvulai Song Lyrics In Telugu – Chandralekha

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Urumulu Nee Navvulai Song Lyrics In Telugu – Chandralekha

ఉరుములు నీ మువ్వలై… మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
పరుగులు నీ గానమై… తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
కాలానికే కాలాడక… ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగ మనసాగక… ఆడాలి నీతో నింగినేల
తఖధిమి తాళాలపై… తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
మెళికల మందాకిని… కులుకుల బృందావని
కనులకు విందీయవే ఆ అందాన్ని

చంద్రుల్లో కుందేలే… మా ఇంట ఉందంటూ
మురిసింది ఈ ముంగిళి
చిందాడే కిరణంలా… మా ముందు నువ్వుంటే
ప్రతి పూట దీపావళి
మా కళ్ళళ్ళో వెలిగించవే సిరివెన్నెల
మా ఆశలే నీ అందెలై… ఈ మంచు మౌనం మోగే వేళ
ఆ సందడే ఆనందమై… ప్రేమించు ప్రాణం పాడే వేళ

ఉరుములు నీ మువ్వలై… మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా కళ్యాణి
తఖధిమి తాళాలపై… తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని

నడయాడే నీ పాదం నటవేదమేనంటూ
ఈ పుడమే పులకించగా
నీ పెదవే తన కోసం అనువైన కొలువంటు
సంగీతం నిను చేరగా
మా గుండెనే శ్రుతి చేయవా, నీ వీణలా
ఈ గాలిలో నీ కేళితో… రాగాలు ఎన్నో వేగే వేళ
నీ మేనిలో హరివిల్లులే… వర్ణాల వాగై సాగే వేళ

ఉరుములు నీ మువ్వలై… మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
తఖధిమి తాళాలపై… తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే హ్మ్ హ్మ్ హ్మ్

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading