ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Unnavaa Asalunnavaa Lyrics in Telugu – Bhakta Tukaram
పల్లవి :
ఉన్నావా… అసలున్నావా
ఉంటే కళ్ళుమూసుకున్నావా… ఈ లోకం కుళ్ళు చూడకున్నవా
ఉన్నావా… అసలున్నావా
ఉంటే కళ్ళుమూసుకున్నావా… ఈ లోకం కుళ్ళు చూడకున్నవా
ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు
ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు
ఉన్నావా… అసలున్నావా
చరణం 1 :
నీ పేరిట వంచన పెరుగుతువుంటే… నీ ఎదుటే హింసలు జరుగుతు వుంటే
మనిషిని మనిషి దోస్తూవుంటే… మంచికి సమాధి కడుతూ వుంటే
రాతి బొమ్మవై నిలిచావు.. చాతగాని వాడనిపించావు
ఉన్నావా… అసలున్నావా
చరణం 2 :
నీ భక్తుడ నయ్యాను.. నిత్య దరిద్రుడనయ్యాను
నీ భక్తుడ నయ్యాను.. నిత్య దరిద్రుడనయ్యాను
సేవలు చేశాను.. నా బ్రతుకే నైవేద్యం చేశాను
చేసిన మేలునుమరిచేవాడా.. నువ్వా దేవుడివి.. నువ్వొక వ్యర్థుడివి
నీకొక పేరూ లేదు.. రూపం లేదు ..
నీతి లేదు.. నియమం లేదు.. నిజానికి నువ్వే లేవు.. లేవు.. లేవు.. లేవు
Unnavaa Asalunnavaa Lyrics in Telugu – Bhakta Tukaram