ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Unna Maata Cheppaneevu Lyrics in Telugu – Nuvvu Naku Nachav
ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామ
నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చేయనోయి రామ
అన్నుకున్నా తప్ప్పు కదా మోమాటం ముప్పుకదా
మనసైతే ఉంది కదా మనమాటే వినదు కదా
పంతం మానుకో భయం దేనికో ||ఉన్నమాట||
వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా
నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా
నన్నస పెట్టి ఈ సరదా రేపినదే నువ్ గనుకా
నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా మన కధను తొందరగా
ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా ||నన్ను దాటి||
అమాయకంగ చూడకలా వేడుకలా చిలిపికలా
అయోమయంగ వేయకలా హాయి వల
నీమీదికొచ్చి మురిపాలే వాలదుగా వాలుజడా
దానొంక చూసి ఎందుకట గుండెదడ
మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా
తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
మరేం చేయనే నీతో ఎలా వేగనే ||నన్ను దాటి||